Sigachi Factory Blast: సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడు ఘటనపై అధికారులు కీలక ప్రకటన చేశారు. ప్రమాదం జరిగిన రోజు గల్లంతైన 8 మంది కార్మికులు ఇంకా కనిపించకపోవడంతో, ఇక వారి ఆచూకీ లభించడం అసాధ్యమే అని అధికారులు తేల్చేశారు. రాహుల్, శివాజీ, వెంకటేష్, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ ల బాడీలు పేలుడు సమయంలో తీవ్రంగా కాలిపోయి బూడిదయ్యి ఉంటారని యాజమాన్యం అనుమానం వ్యక్తం చేస్తుంది. దీని కారణం ఇప్పటివరకు…
అవసరమైతే రోబోలను పంపి.. రెస్క్యూ ఆపరేషన్ లో వాడుకునే దిశగా ప్రయత్నం చేయాలని సూచించామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా సానుభూతి తెలపాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరీక్షించిన ఆయన మీడియాతో మాట్లాడారు. 11 కేంద్ర, రాష్ట్ర సంస్థలు ఈ విపత్తు లో పనిచేస్తున్నాయన్నారు. "ఇది ఒక ప్రమాదం.. ఇది విపత్తు.. అందరం కలిసి సానుభూతి ప్రకటించాల్సిన అవసరం ఉంది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే.. హెలికాప్టర్ ఇచ్చి…
నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగిన స్థలాన్ని నేడు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తెచ్చేందుకు తొమ్మిది రోజులుగా నిర్విరామంగా రెస్య్కూ అవుతున్న విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ ను ముఖ్యమంత్రి సమీక్షించారు. గంటకు పైగా వారితో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలా ఐనా సరే.. ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి…
SLBC Tunnel: శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాద ఘటన ఉత్కంఠను పెంచుతోంది. ప్రమాదం జరిగి దాదాపు 24 గంటలవుతున్న, చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. శిథిలాల్లో చిక్కుకున్న ఈ కార్మికులను రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. సంఘటన స్థలంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే, చిక్కుకున్న కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా వారి క్షేమంపై ఆశలు…
Gold Mines: పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు మాలిలో ఉన్న ఓ బంగారు గని శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టతకు రాలేదు. గాయపడినవారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. అయితే, గనిలో ఇంకా…
Toxic Gas Leak: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం హెట్రో డ్రగ్స్ పరిశ్రమలో మంగళవారం రాత్రి విషవాయువు లీక్ అవడంతో తీవ్ర కలకలం రేగింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో పరిశ్రమలోని 9వ యూనిట్ హెచ్ 7 బ్లాక్‌లో కెమిస్టులు పనిచేస్తుండగా, ఓ పైపు నుంచి ప్రమాదవశాత్తూ విష వాయువు లీకైంది. వాయువు లీక్ కారణంగా సమీపంలో ఉన్న 12 మంది కార్మికులు కళ్లు మంట, గొంతు నొప్పి, ఊపిరాడకపోవడం వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం…