Gold Mines: పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు మాలిలో ఉన్న ఓ బంగారు గని శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టతకు రాలేదు. గాయపడినవారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. అయితే, గనిలో ఇంకా కొంతమంది కార్మికులు చిక్కుకున్నారని భావిస్తున్నారు. బాధితుల కోసం సహాయ బృందాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
మాలి దేశం బంగారం ఉత్పత్తిలో ప్రముఖ దేశాల్లో ఒకటి. అయితే, ఇక్కడి గనుల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతుండటంతో కార్మికుల ప్రాణాలు ముప్పులో ఉంటున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండో పెద్ద ప్రమాదం కావడం గమనార్హం. స్థానిక అధికారులు ఈ సంఘటనను ధృవీకరించారు. కెనిబా గోల్డ్ మైనర్స్ అసోసియేషన్ ప్రకారం మృతుల సంఖ్య 48గా ఉంది. పర్యావరణ సంస్థల అధికారులు ఇంకా అన్వేషణ కొనసాగుతోందని తెలిపారు. ఈ ప్రమాదం కార్మికుల భద్రతా ప్రమాణాలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతోంది. ఈ తరహా ప్రమాదాలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలను పటిష్టం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Read Also: Earthquake: ఢిల్లీలో భూకంపం.. పరుగులు పెట్టిన ప్రజలు..