మహిళల ప్రపంచకప్‌లో టీమిండియా పరిస్థితి డోలాయమాన స్థితిలో ఉంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే మంగళవారం నాటి బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో తప్పక గెలవాలి. అంతేకాకుండా ఈనెల 27న జరిగే దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లోనూ విజయం సాధించాలి. అప్పుడే భారత్ ప్రపంచకప్‌లో సెమీస్ చేరేందుకు అవకాశం ఉంటుంది. టీమిండియా సమస్య ఏంటంటే.. బ్యాటర్లు రాణిస్తున్నప్పటికీ బౌలర్లు మాత్రం పూర్తి స్థాయిలో రాణించడం లేదు. కాబట్టి విజయాల బాట పట్టాలంటే బౌలర్లు తమ బంతులకు…
మహిళల ప్రపంచకప్‌లో టీమిండియా అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. శనివారం నాడు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత మహిళలు ఓటమి పాలయ్యారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసింది. మిథాలీరాజ్ (68), యస్తికా భాటియా (59), హర్మన్ ప్రీత్‌కౌర్ (57…
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌లో అంపైర్లు చేసిన తప్పిదం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ల నిర్లక్ష్యం కారణంగా ఒక ఓవర్‌లో బౌలర్ ఎలాంటి తప్పిదం చేయకుండానే ఏడు బంతులు వేసింది. వైడ్, నోబాల్స్ వేయకుండా ఒక బంతి ఎక్కువగా సంధించింది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 27వ ఓవర్ వేసిన పాకిస్థాన్ బౌలర్ ఒమైమా సోహైల్ ఆరు బంతులు బదులు ఏడు బంతులు వేసింది. ఈ ఓవర్…
టీమిండియా చేతిలో పాకిస్థాన్ మరోసారి చావుదెబ్బ తింది. వన్డే ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చిత్తుగా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 244/7 స్కోరు చేసింది. 245 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 137 పరుగులకు ఆలౌటైంది. దీంతో 107 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా పాయింట్ల పట్టికలో ఖాతా తెరవడంతో పాటు అగ్రస్థానం సంపాదించింది.…
మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లు రంజుగా జరుగుతున్నాయి. న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఇప్పటికే పలు మ్యాచ్‌లు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. నిజానికి మహిళల మ్యాచ్‌లకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉంటోంది. అయితే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కాబట్టి ఈ పోరు పట్ల అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. కాగా మహిళల క్రికెట్‌లోనూ పాకిస్థాన్‌పై భారత జట్టుకు మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు…
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న దేశాలు కొత్త వేరియంట్ కారణంగా భయపడుతున్నాయి. దీని ప్రభావం క్రీడారంగంపైనా పడింది. ఈ నేపథ్యంలో మహిళల వన్డే ప్రపంచకప్ అర్హత టోర్నీని అర్థాంతరంగా రద్దు చేస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. జింబాబ్వేలో జరుగుతున్న ఈ టోర్నీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఎందుకంటే దక్షిణాఫ్రికా దేశానికి పక్కనే జింబాబ్వే ఉంటుంది. అందువల్ల కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి భయంతోనే…