Nirbhaya-Like Horror in Bihar: నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. 2012లో నిర్భయ సామూహిక అత్యాచారం ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. నిర్భయ దారుణానికి పాల్పడిన వారికి మరణశిక్ష విధించింది కోర్టు.. కానీ, ఇలాంటి మనస్తత్వాలు కలిగిన నేరస్థులు.. ఇప్పటికీ సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు.. అవకాశం దొరికినప్పుడల్లా రెచ్చిపోతున్నారు.. బరితెగించి అత్యాచార ఘటనకు పాల్పడుతున్నారు.. నిర్భయ ఘటన జరిగిన దాదాపు 14 సంవత్సరాల తరువాత, రాజధాని ఢిల్లీ నుండి దాదాపు 1,300 కిలోమీటర్ల దూరంలో, క్రూరమైన నేరస్థుల ముఠా మరొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది.. బీహార్‌లోని పూర్నియాలో , ఆరుగురు వ్యక్తులు ఒక అమ్మాయిని బలవంతంగా కారులోకి ఎక్కించి, ఆపై 25 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి, అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు..
ఆ క్రూరమైన గ్యాంగ్ ఓ యువతి పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించారంటే.. ఆ ఘటనకు గురించి చెబితే మానవత్వం కూడా సిగ్గుపడేలా చేసింది. అయితే, బాధితురాలు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక ఆర్కెస్ట్రాలో పనిచేస్తుంది.. మెరుగైన జీవితాన్ని గడిపేందుకు కష్టపడుతోంది.. కానీ, క్రూరమైన యువకుల గ్యాంగ్ ఆమె జీవితాన్ని నరకంగా మార్చింది. ఆర్కెస్ట్రాలో పనిచేసే ఆ యువతిని మొదట అరడజను మంది యువకులు కిడ్నాప్ చేసి, ఆ తర్వాత బలవంతంగా మద్యం తాగించి, రాత్రంతా ఆమెను దారుణంగా హింసించారు. ప్రస్తుతం ఆ మహిళ పూర్ణియా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది.
ఈ ఘటన వివరాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి.. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలు పూర్ణియాలోని న్యూలాల్ చౌక్ నుండి కాలినడకన ఇంటికి తిరిగి వెళ్తుండగా.. కారులో వచ్చిన ఆరుగురు యువకులు ఆమెను మార్గ మధ్యలో అడ్డగించారు.. బాలిక ప్రతిఘటించడంతో, నిందితులు ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించారు.. ఆ తర్వాత శబ్దం చేయకుండా ఉండటానికి ఆమె గొంతును బిగించారు.. ఆ తర్వాత బరియార్ చౌక్‌లోని జయ ట్రేడర్స్‌లోని ఒక గదికి యువతిని తీసుకెళ్లి బంధించారు.. అక్కడ, ఆ యువతికి బలవంతంగా మద్యం తాగించారు.. ఇక, ఆమె కాస్త మత్తులోకి జారుకోవడంతో.. ఆరుగురు నిందితులు.. ఆమెపై ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారం చేశారు. ఈ భయంకరమైన పరిస్థితిలో కూడా, బాధితురాలు అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించింది.. యువతిపై సామూహిక అత్యాచారం చేసిన తర్వాత.. ప్రధాన నిందితుడు మొహమ్మద్ జునైద్ తాగిన స్థితిలో నిద్రలోకి జారుకున్నాడు.. బాధితురాలు ధైర్యం చేసి తన మొబైల్ ఫోన్ నుండి 112కు కాల్ చేసి.. దారుణ ఘటనను పోలీసులకు విరించింది..
ఇక, సమాచారం అందుకున్న వెంటనే, దగ్రువా పోలీస్ స్టేషన్ నుండి పోలీసు పెట్రోలింగ్ బృందం రంగంలోకి దిగి.. బాధిత యువతి ఇచ్చిన సమాచారం.. లైవ్ లొకేషన్ బట్టి.. జయ ట్రేడర్స్ వద్దకు చేరుకున్నారు.. గది తాళం వేసి ఉండటాన్ని గమనించిన పోలీసులు.. తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా, లోపల ఉన్న దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు.. బాధితురాలని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.. ప్రధాన నిందితుడు మద్యం మత్తులో సమీపంలోనే నిద్రపోతున్నాడు.. దీంతో ఘటనా స్థలంలోనే మహ్మద్ జునైద్‌ను పోలీసులు అరెస్టు చేశారు.. SI పూర్ణిమ కుమారి ఈ సంఘటనను ధృవీకరించారు.. ఇది సామూహిక అత్యాచారం కేసు అని తేల్చారు.. ఒక నిందితుడిని అరెస్టు చేశాం.. మిగిలిన ఐదుగురిని గుర్తించేపనిలో ఉన్నాం.. వారిని అరెస్టు చేయడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు..