సీఎం జగన్ పాలనపై విపక్ష నేతలు మండిపడుతూనే వున్నారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ పాలనలో మహిళా భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. పోలీస్ యూనిఫాం కోసం మహిళా పోలీసులకు జంట్స్ టైలర్ తో కొలతలు తీయించడం దారుణం అన్నారామె. యూనిఫాం కుట్టేందుకు లేడీ టైలర్స్ లేరా? వైసీపీ పాలనలో మహిళలకే కాదు.. మహిళా పోలీసులకూ రక్షణ కరువైంని అనిత మండిపడ్డారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ వల్లే మహిళలకు ఇన్ని అవమానాలు జరుగుతున్నాయన్నారు.…