బెంగళూరులో పట్టపగలు ఓ మహిళపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. అందరు చూస్తుండగానే రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి కిందపడేసి కాళ్లతో తన్నుతూ పిడిగుద్దులు కురిపించారు. మహిళ అన్న విషయం మరిచి భౌతిక దాడికి తెగబడ్డారు ఓ షాపు యజమాని, సిబ్బంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బెంగళూరులోని అవెన్యూ రోడ్‌లోని మియా సిల్క్ శారీస్ అనే దుకాణానికి హంపమ్మ అనే మహిళ వెళ్లి చీరలను దొంగిలించింది. అయితే ఈ తతంగం అంతా షాప్ లోని సీసీటీవీలో రికార్డైంది. సీసీటీవీ…