Women Protest: పల్నాడు జిల్లాలో ఓ మహిళ వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తుంది.. తన పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని కొంత మంది ఆక్రమించుకున్నారని అధికారులు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పొలంలో ఆమరణ దీక్షకు దిగింది.
ప్రేమించానని వెంటపడి.. తీరా ఓకే అన్నాక.. పెళ్లికి మొహం చాటేసిన ప్రియుడి ఇంటి ముందు ఓ ప్రేమ బాధితురాలు న్యాయ పోరాటం చేపట్టింది. ప్రేమ పేరుతో వెంటపడి.. సరే నన్నాక.. ఆరేళ్లకుపైగా కాలం కలసి మెలసి తిరిగి ఆ తర్వాత మొహం చాటేశాడని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఓ మహిళ దీక్షకు దిగింది. తన భర్త దాంపత్య జీవితానికి పనికిరాడని.. ఈ విషయం తెలిసి కూడా తమ కుమారుడితో తనకు పెళ్లి చేసి అత్తామామలు జీవితాన్ని నాశనం చేశారంటూ మహిళ ఆందోళన చేపట్టింది. అత్తింటివారి వేధింపుల నుండి కాపాడి తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ పుట్టింటివారితో కలిసి ఆమె నిరాహార దీక్ష చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తన పెళ్లి అయినప్పటి నుంచి తాను భర్తతో…