హైదరాబాద్‌లోని నందినగర్‌లో విషాదం చోటుచేసుకుంది. నంది నగర్‌లో మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందగా.. మరో 20 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తు్న్నారు. నందినగర్‌లో వారాంతపు సంతలో పెట్టిన మోమోస్‌ను బాధితులు తిన్నట్లు తెలిసింది.
లోక్‌సభ ఎన్నికల వేళ హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓటు వేయడానికి వెళ్లిన ఓ మహిళ గుండె పోటుతో మృతి చెందింది. భరత్ నగర్‌కి చెందిన విజయ లక్ష్మి.. ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్‌కు వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలారు. పోలింగ్ సిబ్బంది, స్థానికులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. గుండెపోటుతో మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనతో విజయ లక్ష్మి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకొని ఉప్పల్ పోలీసులు విచారిస్తున్నారు.
ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడటంతో మహిళ మృతి చెందిన ఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలో ఆదివారం జరిగింది. మూసాపేట్ వై జంక్షన్ వద్ద చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే మహిళ(45)పై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. తీవ్రరక్తస్రావమై ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
Delhi Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక మహిళ మంటల్లో చిక్కుకుని మృతి చెందింది. తూర్పు ఢిల్లీలోని షకర్‌పూర్ ప్రాంతంలోని ఓ భవనంలో సోమవారం అర్థరాత్రి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.
Telangana: మనం అనారోగ్యం బారిన పాడినప్పుడు మనకు మొదట గుర్తుకు వచ్చేది డాక్టర్లు. ఎందుకంటే ఎలాంటి సమస్యకైనా వైద్యం చేసి ప్రాణాలను నిలిపేందుకు ప్రయత్నిస్తారు డాక్టర్లు. అందుకే వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. అంటే వైద్యం చేసే డాక్టర్ దేవునితో సమానం. ఎందుకంటే ప్రాణాపాయ స్థితిలో కూడా వైద్యులు చికిత్స చేసి పోతున్న ప్రాణాన్ని నిలుపుతారు. అయితే డబ్బుల కోసం తెలిసి తెలియని వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే వైద్యులు కూడా ఉన్నారు.…