Telangana: మనం అనారోగ్యం బారిన పాడినప్పుడు మనకు మొదట గుర్తుకు వచ్చేది డాక్టర్లు. ఎందుకంటే ఎలాంటి సమస్యకైనా వైద్యం చేసి ప్రాణాలను నిలిపేందుకు ప్రయత్నిస్తారు డాక్టర్లు. అందుకే వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. అంటే వైద్యం చేసే డాక్టర్ దేవునితో సమానం. ఎందుకంటే ప్రాణాపాయ స్థితిలో కూడా వైద్యులు చికిత్స చేసి పోతున్న ప్రాణాన్ని నిలుపుతారు. అయితే డబ్బుల కోసం తెలిసి తెలియని వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే వైద్యులు కూడా ఉన్నారు. కొందరు వ్యక్తులు చేతకాని వైద్యంతో ప్రజల ప్రాణాలను తీసిన ఘటనలు గతంలో కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా కొమరంభీం జిల్లాలో వెలుగు చూసింది.
Read also:Dharmapuri Arvind: అబద్దాన్ని అందంగా చెప్పేవాడే కేసీఆర్..
వివరాలలోకి వెళ్తే.. కొమరంభీం జిల్లా చింతలమనేపల్లి మండలం లోని కోర్సిని లో దన్నురి పుష్పలత అనే మహిళకు నిన్న జ్వరం రావడం చేత ఆమె ఆర్.ఎం.పి. వైద్యున్ని సంప్రదించింది. కాగా ఆర్.ఎం.పి డాక్టర్ వైద్యం అందించిన అనంతరం పుష్పలత తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీనితో కుటుంబ సభ్యులు ఆ మహిళను కాగజ్ నగర్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా పుష్పలత చికిత్స పొందుతూ మరణించింది. ఈ నేపథ్యంలో ఆర్.ఎం.పి వైద్యం వికటించి మృతి చెందిందని పోలిసులకు పిర్యాదు చేసారు బంధువులు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటన పైన దర్యాప్తు చేపట్టారు.