ప్రస్తుతం చలికాలం మొదలైంది.. ఈ కాలంలో కొన్ని కూరగాయలను పండించడం అనుకూలమైనది.. ఈ కాలంలో ముఖ్యంగా దుంపజాతి కూరగాయలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ , టమాట, మిరప, వంట వంటి పంటలను సాగుకు అనుకూలంగా ఉంటాయి. రైతులకు అధిక ఆదాయాన్ని సమకూరుస్తాయి.. ఇకపోతే ఈ సీజన్ లోనే దిగుబడులు ఎక్కువగా పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు.. ఈ కాలంలో చీడ, పీడలను తట్టుకొనే కూరగాయల విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.. అప్పుడే తెగుళ్ల నుంచి బయటపడారు.. ఇక రబీలో చలి ఎక్కువగా…
Health News: చలి చంపేస్తోంది. ఉదయం తొమ్మిదైనా గానీ చలితీవ్రత తగ్గట్లేదు. అందులోనూ ఈ కాలంలో సూర్యుడు పగటిపూట తక్కువగా ఉంటాడు. దీంతో సాయంత్రం 6అయిందంటే చాలు ఇంటికే పరిమితం కావాల్సి వస్తుంది.
Winter Yoga: చలికాలంలో సాధారణంగా శరీరం బిగుసుకుపోతుంది. దీంతో కండరాల నొప్పులు వస్తుంటాయి. చలికాలంలో తగినంత సూర్యరశ్మి శరీరానికి తగలకపోవడంతో కండరాలకు సంబంధించి కొన్ని వ్యాధులు సంభవిస్తుంటాయి. అయితే చలికాలంలో కండరాలు బిగుసుకుపోకుండా ఉండాలంటే శరీరంలో వేడిని ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు యోగాసనాలు వేయాలని వైద్యులు సూచిస్తున్నారు. యోగాసనాలు వేయడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుందని.. తద్వారా ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వేలాది సంవత్సరాలుగా యోగా మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుందని…
Oval Stadium: ప్రస్తుతం శీతాకాలం సీజన్ నడుస్తోంది. భారత్‌లోనే కాదు ఇంగ్లండ్‌లోనూ ప్రజలను చలి గజగజ వణికిస్తోంది. క్రిస్మస్‌కు ముందే లండన్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 15 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. అటు యూకేలోని చాలా ప్రాంతాల్లో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు మైనస్ 10-12 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో మంచు విపరీతంగా కురుస్తోంది. ఈ క్రమంలో ప్రఖ్యాత ఓవల్ మైదానాన్ని రెండు అడుగుల మేర మంచు కప్పేసింది. మంచు దుప్పటిలో ఓవల్ మైదానం వీడియోలు, ఫోటోలు…
snowstorm buries western New York: అమెరికా వాణిజ్యనగరం న్యూయార్క్ వ్యాప్తంగా భారీగా హిమపాతం కురుస్తుంది. దీంతో నగరంలోని రోడ్లపై భారీగా మంచు పేరుకుపోయింది. ముఖ్యంగా పశ్చిమ న్యూయార్క్ బఫెల్లో ప్రాంతంలో మంచు తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో 6 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. దీంతో ప్రజా జీవితం స్తంభించింది. బఫెలో ప్రాంతంలో రోడ్లు మూసేశారు. అనేక విమానాలు రద్దు అయ్యాయి. నగరంలో ప్రయాణాలు దాదాపుగా పరిమితం చేయబడ్డాయి.
Health Tips: చలికాలంలో ఉదయం పూట మంచు కురుస్తున్నా కొంతమంది వాకింగ్ చేస్తుంటారు. మంచు పడుతుండగా అప్పుడే వెచ్చని సూర్యకిరణాలు పడుతున్న సమయంలో వాకింగ్ చేయడాన్ని కొంతమంది ఇష్టపడుతుంటారు. అయితే చలిలో వాకింగ్ చేస్తే అనారోగ్యం బారిన పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బెల్స్‌పాల్సీ అనే వ్యాధి బారిన పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ప్రతి ఏడాది శీతాకాలంలో హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో ఇలాంటి కేసులు నమోదవుతుంటాయని.. అందుకే యువత, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని…
తెలంగాణలో చలి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే పలుచోట్ల తక్కువ స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున అత్యల్పంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధారిలో 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు చలి అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలు తగుజాగ్రత్తలు వహించాలని వారు సూచించారు. Read Also: బీ అలర్ట్… దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది మరోవైపు…
ఆదిలాబాద్‌లో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఏజెన్సీ ప్రాంతాల్లో రికార్డు స్థాయిల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాలు గజగజ వణికిపోతున్నాయి. దాదాపు ఏజెన్సీ అన్ని ప్రాంతాల్లో ఉష్ణో గ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి.దట్టమైన మంచు పొగ మంచు కురుస్తుండటంతో ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. రోజు వారి కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుంది. ఉదయం పూట పనుల్లోకి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో…
తెలంగాణలో శీతల గాలులు వీస్తుండటంతో చలి క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే ఐదు వారాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణశాఖ శాస్త్రవేత్తలు వెల్లడించారు. సోమవారం నాడు మెదక్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 13.8 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 14,8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17 డిగ్రీలు, ఖమ్మంలో 19 డిగ్రీలు, నిజామాబాద్‌లో 17.8 డిగ్రీలు, నల్గొండలో 20 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 21 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. Read Also: వరల్డ్ రికార్డ్:…