Health News: చలి చంపేస్తోంది. ఉదయం తొమ్మిదైనా గానీ చలితీవ్రత తగ్గట్లేదు. అందులోనూ ఈ కాలంలో సూర్యుడు పగటిపూట తక్కువగా ఉంటాడు. దీంతో సాయంత్రం 6అయిందంటే చాలు ఇంటికే పరిమితం కావాల్సి వస్తుంది. చలినుంచి తప్పించుకునేందుకు అనేక బట్టలు వేసుకోవాల్సి వస్తుంది. అయినా చలినుంచి ఉపశమనం కలగడంలేదు. ఈ క్రమంలో నైట్ పడుకునే సమయంలో చలికి తట్టుకోలేక చాలా మంది ముఖం అంతా కప్పుకుని పడుకుంటారు. కానీ అలా చేయొద్దంటున్నారు నిపుణులు. అది చాలా డేంజరట…
అల్జీమర్స్ లేదా డిమెన్షియా బాధితులు కావచ్చు
రాత్రంతా బెడ్ షీట్ల లోపల ముఖం పెట్టుకుని పడుకోవడం వల్ల ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. అదే సమయంలో, పెరిగిన వేడి కారణంగా అలసట, తలనొప్పి లేదా గందరగోళం వంటి సమస్యలు కూడా సంభవించవచ్చు. రాత్రిపూట బొంత లోపల నిద్రపోవడం కూడా మానసిక ఆరోగ్యానికి భంగం కలిగిస్తుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఇలా ఎక్కువ కాలం చేసే వారికి కూడా అల్జీమర్స్ లేదా డిమెన్షియా వంటి తీవ్రమైన మతిమరుపు వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
స్లీప్ అప్నియా రోగులకు చాలా ప్రమాదం
స్లీప్ అప్నియా(నిద్ర సంబంధిత వ్యాధి)తో బాధపడుతున్న వ్యక్తులు నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. అలాంటివారిలో నిద్రపోతున్నప్పుడు హఠాత్తుగా శ్వాస ఆగిపోయి భయంతో మెలకువ వస్తుంది. శ్వాసను ఆపడానికి సమయం 1 నిమిషం వరకు ఉంటుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు ముస్కు తన్ని పడుకోవడం వారికి ప్రాణాంతకంగా మారవచ్చు. ఇలా పడుకోవడం వల్ల అనేక సందర్భాల్లో సమస్యను మరింత పెంచుతుంది.
ఆక్సిజన్ తక్కువై గుండెపోటుకు దారితీస్తుంది
మీ కుటుంబంలో ఎవరైనా ముస్కు తన్ని నిద్రపోయే అలవాటు ఉంటే వారిలో ఆక్సీజన్ సరఫరా తక్కువవుతుందని తెలపాలి. అలా పడుకోవద్దని హెచ్చరించండి. దీని వల్ల ఊపిరాడక పోవడం లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆక్సిజన్ లేకపోవడం ఆస్తమా లేదా గుండె జబ్బులతో బాధపడుతున్న వ్యక్తులకు తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో గుండెపోటు కూడా రావొచ్చు.
ఈ అలవాటును వెంటనే మార్చుకోండి
బెడ్ షీట్ లోపల నోరు పెట్టి పడుకునే అలవాటు చాలా హానికరం. కాబట్టి ఈ అలవాటును వెంటనే మార్చుకోవాలి. మీకు చలి ఎక్కువగా అనిపిస్తే, మీ శరీరానికి తగినంత ఆక్సిజన్ అందేలా మెత్తని బొంతను తల, నోరు, ముక్కు వరకు కప్పి ఉంచుకోవాలి. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుండి మిమ్మల్ని కాపాడుతుంది.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.