పహల్గామ్ ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి కీలక వ్యాఖ్యలు చేశారు. వినయ్ నర్వాల్ గౌరవార్థం నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరమ్ ఆఫ్ ఆర్టిస్ట్స్ అండ్ యాక్టివిస్ట్స్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి హిమాన్షి హాజరయ్యారు.