తన చిన్ననాటి స్నేహితుడ్ని ఓ వ్యక్తి దారుణంగా మోసం చేశాడు. స్నేహాన్ని అడ్డం పెట్టుకొని, అతని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసి మందలించడంతో, చివరికి భార్యని తీసుకొని పరారయ్యాడు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మంతట్టి గ్రామానికి చెందిన గుడాల పరమేశ్, పావని భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన పిట్టలి విశ్వనాథ్, పరమేశ్ చిన్ననాటి స్నేహితులు. వీళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసి ఉండేవారు.…