ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్‌కు హత్యా బెదిరింపులు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర ముంబైలోని సిల్వర్ ఓక్‌లో పవార్ నివాసానికి ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. షూట్ చేసి చంపేస్తానని హెచ్చరించాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడ్ని గుర్తించారు.