జీవితాంతం తోడునీడలా కలిసి జీవిస్తామని పెళ్లిలో ప్రమాణం చేస్తారు. జీవిత ప్రయాణంలో ఎన్ని కష్టాలెదురొచ్చినా చివరి వరకు కలిసి ఉంటామని పెళ్లితో ముందడుగు వేస్తారు. ఈ జీవిత ప్రయాణంలో తన తోడును కోల్పోతే ఆ బాధ వర్ణణాతీతం. కేవలం దానిని అనుభవించేవారికే దాని విలువ తెలుస్తుంది. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కాదు.
బీహర్‌లోని అర్రా జిల్లాలో రైలు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఆ మహిళ తన ముగ్గురు చిన్నారులతో సహా రైలు ముందు దూకింది. ఈ ఘటనలో సదరు మహిళ మృతి చెందగా.. ముగ్గురు పిల్లలు గాయపడ్డారు.