నేడు ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది. స్పష్టత రాకుంటే కార్యాచరణపై భేటీ కావాలని జేఏసీల ఐక్య వేదిక భావిస్తోంది. నేడు కోవిడ్ పరిస్థితులు, వాక్సినేషన్‌పై ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను కమిటీ ఖరారు చేయనుంది. నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా…