Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. బెంగాల్ రాష్ట్రంలో ఉగ్రవాద నెట్వర్క్‌లు పనిచేస్తున్నాయని అమిత్ షా చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. పహల్గాం దాడిని కేంద్రమే చేసిందా? అని మమత ప్రశ్నించారు.
Suvendu Adhikari: బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువుల హత్యలు, దాడులపై పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత, ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఇజ్రాయిల్ గాజాలో చేసినట్లే, భారత్ కూడా బంగ్లాదేశ్‌కు గుణపాఠం నేర్పాలి’’ అని అన్నారు. శుక్రవారం రోజు బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ,
West Bengal: పశ్చిమ బెంగాల్‌లో బాబ్రీ మసీదును నిర్మిస్తామని చెబుతూ, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వార్తల్లో వ్యక్తిగా మారారు. బాబ్రీ వివాదం కారణంగా, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కబీర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వచ్చే ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హుమాయున్ కబీర్ సొంతగా ‘‘జనతా ఉన్నయన్ పార్టీ’’ని స్థాపించాడు. అయితే, ఇప్పుడు ఆయన మరో వివాదంలో ఇరుక్కున్నాడు. ఎన్నికల్లో తన పార్టీ తరుపున తాత్కాలిక అభ్యర్థుల జాబితా…
PM Modi: వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యం, ప్రధాని నరేంద్రమోడీ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శనివారం కోల్‌కతా విమానాశ్రయం నుంచి తన వర్చువల్ ర్యాలీ ద్వారా ప్రధాని టీఎంసీపై తీవ్ర విమర్శలు చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వం సాగిస్తున్న బీహార్ లాంటి జంగిల్ రాజ్‌ను వదిలించుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని అనుకుంటున్నారని ప్రధాని అన్నారు. Read Also: PM Modi: టీఎంసీ అభివృద్ధిని…
West Bengal: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా రాష్ట్రంలో ఓటర్ల జాబితాపై చేపట్టిన SIR (Special Intensive Revision) ప్రక్రియ తొలి దశను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా మంగళవారం విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా రాజకీయ చర్చకు దారి తీసింది.
Asaduddin Owaisi: వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే పశ్చిమ బెంగాల్లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల, ముర్షిదాబాద్‌లోని బెల్దంగా ప్రాంతంలో ‘‘బాబ్రీ మసీదు’’ నిర్మిస్తానని చెప్పి, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.
Mamata Banerjee: మరికొన్ని నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) పేరుతో ఓటర్ల జాబితాను సమీక్షిస్తోంది. అయితే, దీనిపై బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడుతోంది. మరోసారి సర్ ప్రక్రియను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితాలో మహిళల పేర్లు తొలగిస్తే, వారంతా వంటగదిలో వాడే పనిముట్లతో సిద్ధంగా ఉండాలని కోరారు. ‘‘ఎస్ఐఆర్ పేరుతో తల్లులు, సోదరీమణుల…
Babri Masjid: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ముందు మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇటీవల సస్పెండ్ అయిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ ముర్షిదాబాద్‌లో ‘‘బాబ్రీ మసీదు’’ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంచలనంగా మారింది.
Trinamool Congress: పశ్చిమ బెంగాల్ రాజకీయాలను ‘‘బాబ్రీ మసీదు’’ వివాదం నిప్పు రాజేసింది. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. డిసెంబర్ 6 ముర్షిదాబాద్ జిల్లాలో బాబ్రీ మసీదు నమూనాతో మసీదు నిర్మిస్తామని ప్రకటించారు.
BJP: బీహార్‌లో ఎన్డీయే కూటమి సంచలన విజయం దిశగా దూసుకెళ్తోంది. 243 సీట్లలో ఏకంగా 190+ స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఆర్జేడీ+కాంగ్రెస్ పార్టీల ‘‘మహాఘట్బంధన్’’ కూటమి ఘోర పరాజయం దిశగా వెళ్తోంది. కేవలం 50 లోపు స్థానాలకు మాత్రమే పరిమితం అవ్వడం తేజస్వీ యాదవ్, రాహుల్ గాంధీలను షాక్‌కు గురిచేస్తోంది. బీహార్ ఎన్డీయే విజయంపై బీజేపీ, జేడీయూ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.