CM Mamata Banerjee : మూడు హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత, ప్రతిపక్ష పార్టీల కూటమి అయిన ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) గురించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బీజేపీకి వ్యతిరేకంగా బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రతిపక్షాల ఐక్యత కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని పలు కీలక నేతలతో భేటీలు అవుతున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీతోనూ ఆయన సమావేశం అయ్యారు. సోమవారం హౌరాలోని రాష్ట్ర సచివాలయం నబన్నాలో మమతా బెనర్జీని సీఎం నితీశ్ కుమార్, ఆయన డిప్యూటీ తేజస్వీ యాదవ్ కలిశారు.
బిజెపి నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష శక్తులను ఏకం చేసే పనిని స్వయంగా తీసుకున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవనున్నారు. మోడీ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా బిహార్ సీఎం నితీష్ వివిధ పార్టీల నేతలను కలుస్తున్నారు. ఇప్పటికే పలువురు విపక్ష నేతలను కలిశారు.
బీజేపీని కేంద్రంలో అధికారం నుంచి తప్పించేందుకు టీఎంసీ అధినేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కంకణం కట్టుకున్నారు. దీనికోసం నిత్యం అన్ని పార్టీల ప్రముఖ రాజకీయ నేతలను మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆమె శరద్‌పవార్‌తో భేటీ అయ్యారు. అనంతరం శరద్ పవార్ మాట్లాడుతూ.. బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయం కావాలన్నారు. అంతేకాకుండా టీఎంసీతో మాకు పాత అనుబంధం ఉందని గుర్తు…
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో పట్టు సాధించడానికి అన్ని పార్టీలు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాయి.. ఓవైపు, మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ పావులు కదుపుతుంటూ.. ఇంకా వైపు.. ప్రతీ అంశాన్ని క్యాచ్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది.. ఎస్పీ, బీఎస్పీలు కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.. ఇక, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. ఇతర రాష్ట్రాలకు విస్తరించడంపై ఫోకస్ పెట్టింది.. ఈ తరుణంలో.. కాంగ్రెస్ పార్టీకి గట్టి…
పశ్చిమబెంగాల్లో అధికార టీఎంసీ ఉప ఎన్నికల బరిలో దిగనున్న అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జి భవానీపూర్ నుంచి బరిలో దిగనున్నారు. ఇక షంషేర్ గంజ్ నుంచి అమీరుల్ ఇస్లాం, జాంగీర్‌పూర్ నుంచి జాకీర్ హుస్సేన్ పోటీ చేయనున్నారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో ఖాళీగా ఉన్న మూడు నియోజకవర్గాలకు… సెప్టెంబర్ 30న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్రం ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. కాగా.. మూడు రోజుల క్రితమే ఈ ఎన్నికల షెడ్యూల్ ను…
ప్రధాని నరేంద్ర మోడీతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ కానున్నారు. ఈ నెల 28న వీరి భేటీ జరగనుంది. ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో కూడా భేటీ కానున్నారు. మమతా బెనర్జీ కోల్‌కతాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. కేంద్రంలో ‘పెగాసస్’ స్పైవేర్ వివాదం నడుస్తున్న సమయంలో మమత భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. దాదాపు మూడు నెలల తర్వాత మమతా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అయితే ఇది…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తమ్ముడు అషిమ్ బెనర్జీ కరోనా కారణంగా మృతి చెందారు. బెంగాల్ లో కరోనా కేసులు అమాంతం పెరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న ఒక్కరోజే బెంగాల్ లో 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 136 మంది మృతి చెందారు. బెంగాల్ లో రేపటి నుంచి మే 30వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించారు. అత్యవసర సేవలను అనుమతించడంతో పాటు, అవసరమైన వస్తువుల కొనుగోలుకు…