పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడి జరిపింది. జెనిన్‌లోని శరణార్థి శిబిరంపై జరిగిన ఈ దాడుల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన ఈ దాడుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.
21 Dead, Including 9 Children In Gaza Home Fire: పాలస్తీనా గాజా నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరానికి ఉత్తరంగా ఉన్న ఓ ఇంట్లో నిల్వ ఉంచిన ఇంధనం కారణంగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు పిల్లలతో సహా మొత్తం 21 మంది మరణించారు. పాలస్తీనాను నియంత్రించే హమాస్ ఇస్లామిస్టులు, స్థానిక అగ్నిమాపక దళాలు మంటలను ఆర్పేశాయి. 21 మంది మరణించినట్లు స్థానిక అధికారులు ప్రకటించారు.