Israel Raids: పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడి జరిపింది. జెనిన్‌లోని శరణార్థి శిబిరంపై జరిగిన ఈ దాడుల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన ఈ దాడుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. రెండు దశాబ్దాల్లో జరిగిన అత్యంత ఘోరమైన ఈ ఘటనపై పాలస్తీనాలో తీవ్రమైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వెస్ట్ బ్యాంక్ నగరంలో జరిగిన ఈ దాడిలో ఈ ఏడాది ఇజ్రాయెల్ దళాలచే చంపబడిన పాలస్తీనియన్ల మొత్తం సంఖ్య 30కి చేరుకుంది. దీనిని ఉగ్ర నిరోధక చర్యగా ఇజ్రాయెల్ అభివర్ణించింది. ఇజ్రాయెల్‌తో భద్రతా సంబంధాలను తగ్గించుకోవాలని పాలస్తీనా నాయకులపై ఒత్తిడి పెరుగుతోంది. మరో ఘటనలో 22 ఏళ్ల పాలస్తీనియుడిపై ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరపగా.. అతడు ప్రాణాలు కోల్పోయాడు.
పాలస్తీనియన్ రెడ్ క్రెసెంట్ (PRC) ప్రకారం, ఇజ్రాయెల్ దళాలు మొదట వైద్య సిబ్బందిని జెనిన్ శిబిరానికి వెళ్లడం అసాధ్యం చేశాయి, అక్కడ గాయపడిన నలుగురు వ్యక్తులు తీవ్రమైన పరిస్థితిలో ఉన్నారు. జెనిన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇజ్రాయెల్ దళాలు టియర్ గ్యాస్ డబ్బాలను కూడా కాల్చాయని, దీని ఫలితంగా పిల్లలు దానిని పీల్చడం వల్ల అస్వస్థతకు గురయ్యారని పేర్కొంది. అయితే, దాడిలో అమాయక పాలస్తీనియన్లు చంపబడ్డారనే వాదనలను ఇజ్రాయెల్ దళం ఖండించింది. దళాలు ఇస్లామిక్ జిహాద్ టెర్రర్ ఆర్గనైజేషన్‌కు చెందిన టెర్రర్ స్క్వాడ్‌ను పట్టుకోవడానికి గురువారం జెనిన్‌లో పనిచేస్తున్నారని, ఆ దళాలు పలువురు ఉగ్రవాదులను చంపినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనపై పాలస్తీనా అథారిటీ ప్రధాన మంత్రి ముహమ్మద్ ష్టయేహ్ స్పందించారు. తమ దేశంలోని పిల్లలు, యువత, మహిళలకు రక్షణ కల్పించేందుకు అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలను కోరారు.
Mother Tearful: ఆకలి వేస్తున్న అన్నం పెట్టడం లేదు.. కన్నీరు పెట్టుకున్న తల్లి
ఇజ్రాయెల్ సైనికులు, పౌరులపై దాడులకు పాల్పడిన ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్‌లో తీవ్రవాద దాడిని నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారని.. అందుకే వారి హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ వెల్లడించారు. ఇజ్రాయెల్ దళాలకు సంబంధించి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సైన్యం తెలిపింది.