అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని, ప్రభుత్వ లక్ష్యసాధనకనుగుణంగా అధికారులు అలసత్వం వీడి బాధ్యతతో పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మంగళవారం నాడు వెలగపూడి సచివాలయంలో విభిన్న ప్రతిభావంతులు, వయో వయోవృద్దులు, ట్రాన్స్ జెండర్స్ సంక్షేమంపై అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
Minister Tummala: సంక్షేమ పథకాలు అమలు కొంత ఆలస్యం అవ్వొచ్చు కానీ, చేసి తీరుతామని వ్యవసాయ, చేనేత, టెక్స్ టైల్స్ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
కారల్ మార్క్స్, మహాత్మ గాంధీ సిద్ధాంతాలు చదివి సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని నేను అనను అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కానీ వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుని జగన్ వెళుతున్నారు అనేది మాత్రం నేను చెబుతానంటూ సజ్జల అన్నారు.
Minister KTR: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ సర్కార్ చేనేత కార్మికులకు తీపి కబురు అందించింది. ఇప్పటి వరకు 59 ఏళ్లలోపు వారికి మాత్రమే నేతన్న బీమా పథకం అమలు చేస్తున్నామని, ఇక నుంచి 75 ఏళ్ల వరకు వర్తింపజేస్తామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.