Today (13-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ వ్యాపారం ఎట్టకేలకు మురిసింది. ఈ వారాంతాన్ని లాభాలతో ముగించింది. ఇవాళ శుక్రవారం ఉదయం కూడా నష్టాలతోనే ప్రారంభమైన సూచీలు.. మొత్తానికి.. ఇంట్రాడేలో కోలుకొని.. చివరికి పాజిటివ్‌గా క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ ఒకానొక దశలో 59 వేల 628 పాయింట్లకు పడిపోయి.. మళ్లీ.. 60 వేల 418 పాయింట్లకు ర్యాలీ తీసింది. నిఫ్టీ కూడా తిరిగి 18 వేల పాయింట్ల బెంచ్ మార్క్‌ను చేరుకుంది.