లేడీ సూపర్ స్టార్ నయనతార ఎట్టకేలకు తన ప్రియుడు విగ్నేష్ శివన్ ను వివాహమాడిన విషయం విదితమే. ఎంతోకాలంగా ప్రేమలో మునిగిన తేలుతున్న ఈ జంట మహాబలిపురంలోని ఒక రిసార్ట్ లో అత్యంత సన్నిహితుల మధ్య ఒక్కటి అయ్యారు. ఉదయం నుంచి వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తన పెళ్లి ఫోటోలను షేర్ చేసిన విగ్నేష్ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు. “నయన్, నేను ఒక్కటయ్యాం.. భగవంతుడి ఆశీస్సులు, తల్లిదండ్రులు, స్నేహితులు,…
ఎన్నాళ్ళో వేచిన ఉదయం, ఈరోజే ఎదురయ్యింది.. అని పాడుకుంటున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార అభిమానులు.. ఎప్పుడెప్పుడు ఆమె పెళ్లి పీటలు ఎక్కనుందా అని ఎదురుచూసిన వారికి ఈరోజు ఆ తరుణం రావడంతో సంబరబడిపోతున్నారు. అవును.. ఎట్టకేలకు ఆ ఇద్దరు ఒక్కటయ్యారు. కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయన్ తార- విఘ్నేష్ శివన్ ఈరోజు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత ఐదేళ్లుగా ఈ జంట ప్రేమలో మునిగితేలుతున్న విషయం విదితమే.. ఈ జంట గురించి చేసినన్ని పుకార్లు మరెవ్వరి…
దక్షిణాది అగ్ర హీరోయిన్ నయనతార, తమిళ సినీ దర్శకుడు విఘ్నేశ్ శివన్ పెళ్లి బంధంతో ఒకటవుతున్న సంగతి తెలిసిందే. ఇంతకాలం ప్రేమలోకంలో మునిగితేలిన ఈ లవ్ బర్డ్స్ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు.ఈ రోజు(జూన్ 9న) నయన్-విఘ్నెశ్ మహాబలిపురంలోని ఓ రీసార్ట్‌లో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. భారీ భద్రత నడుమ అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో కొద్ది గంటలకు ముందు విఘ్నేశ్ కాబోయే భార్య నయనతార గురించి ఓ స్పెషల్ పోస్ట్ షేర్…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలోని సీనియర్ హీరోయిన్లందరూ పెళ్లి బాట పట్టారు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లిస్టులో ఉన్న ముద్దుగుమ్మలందరూ పెళ్లి పీటలు ఎక్కేశారు. ఇక తాజాగా వీరి లిస్ట్ లోకి చేరిపోయింది లేడీ సూపర్ స్టార్ నయనతార.. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ఐదేళ్లగా ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎట్టకేలకు వివాహం చేసుకోబోతుంది. జూన్ 9న వీరి వివాహం అట్టహాసంగా మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో జరగబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి…
దక్షిణాది సూపర్ స్టార్ నయనతార వివాహం ప్రియుడు విఘ్నేష్ శివన్ తో రేపు చెన్నైకి సమీపంలోని మహాబలిపురంలో జరగనుంది. గత ఐదేళ్ళుగా డేటింగ్ లోఉన్న ఈ జంట పెళ్ళి గురించి పలుమార్లు మీడియాలో న్యూస్ హల్ చల్ చేసింది. అయితే ఎన్నో సార్లుగా వాయిదా పడుతూ వచ్చినప్పటికి ఈసారి మాత్రం ఈ జంట పెళ్ళి పీటలు ఎక్కనుంది. నయన్, విఘ్నేష్ శివన్‌ల వివాహమహోత్సవ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో ‘దేవుడితో పాటు…
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మధురానుభూతి. జీవితంలో ఒక్కసారే జరిగే అద్భుతమైన వేడుక. అందుకే కాస్త ఆలస్యమైనా మంచి ముహూర్తం చూసుకుని పెళ్లిళ్లు చేస్తుంటారు. అయితే కరోనాతో గత రెండేళ్లుగా పెళ్లిళ్లు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మంచి ముహూర్తాలు ఉండటం, కరోనా ఉధృతి తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల హడావిడి నెలకొంది. అయితే ఈ ఏడాది జూన్ నెల దాటితే ముహూర్తాలు లేవని పండితులు స్పష్టం చేస్తున్నారు. మళ్లీ డిసెంబర్ వరకు ముహూర్తాలు లేకపోవడంతో…
తమిళనాడులోని ఓరథనాడు ప్రాంతంలో ఓ ఇంట్లో పెళ్లికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగాయి. ఈ శుభకార్యం కోసం బంధువులు, స్నేహితులంతా తరలివచ్చారు. దీంతో సదరు కుటుంబం అతిథులకు మటన్ బిర్యానీతో డిన్నర్ ఏర్పాటు చేశారు. పెళ్లితంతు అంతా సవ్యంగానే జరిగింది. అయితే ఒక్కసారిగా పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మటన్ బిర్యానీ లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పడంతో అక్కడున్న వారు అవాక్కయ్యారు. అయితే ఇదంతా జొమాటో నిర్లక్ష్యంతోనే జరిగిందని కుటుంబ సభ్యులు…
మొత్తానికీ ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ ప్రేమ పెళ్ళి పీటలకు చేరిపోయింది. మే 18, బుధవారం రాత్రి చెన్నయ్ లో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వారి పెళ్ళి జరిగింది. తేజ దర్శకత్వం వహించిన ‘ఒక వి చిత్రం’తో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి రెండో కొడుకు ఆది ఆ తర్వాత తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. అందులో ‘మృగం’ చిత్రం అతనికి నటుడిగా గొప్ప గుర్తింపు…
బాలీవుడ్ ప్రేమ జంట రణబీర్- అలియా పెళ్లి అయిపోయింది.. ఎన్నో రోజులుగా వస్తున్న రూమర్లకు చెక్ పడిపోయింది. ఎట్టకేలకు బీ-టౌన్ గ్లామరస్ జోడీ పెళ్లితో ఒక్కటైపోయింది. రణ్బీర్ కపూర్ బాంద్రా నివాసమైన ‘వాస్తు’లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో రణబీర్ కపూర్- అలియా భట్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక వీరి పెళ్లిలో బాలీవుడ్ మొత్తం మెరిసింది. పెళ్లి కార్యక్రమాల నుంచి పెళ్లి వరకు తమ ఫోటో ఒక్కటి కూడా లీక్ కాకుండా జాగ్రత్త…