దక్షిణాది అగ్ర హీరోయిన్ నయనతార, తమిళ సినీ దర్శకుడు విఘ్నేశ్ శివన్ పెళ్లి బంధంతో ఒకటవుతున్న సంగతి తెలిసిందే. ఇంతకాలం ప్రేమలోకంలో మునిగితేలిన ఈ లవ్ బర్డ్స్ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు.ఈ రోజు(జూన్ 9న) నయన్-విఘ్నెశ్ మహాబలిపురంలోని ఓ రీసార్ట్‌లో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. భారీ భద్రత నడుమ అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో కొద్ది గంటలకు ముందు విఘ్నేశ్ కాబోయే భార్య నయనతార గురించి ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేశాడు.
‘ఈ రోజు జూన్ 9.. ఇది నయన్ లవ్. థ్యాంక్యూ గాడ్… నా జీవితాన్ని దాటిన అందమైన వ్యక్తులు, విశ్వం, సంకల్పానికి ధన్యవాదాలు !! ప్రతి మంచి ఆత్మ, ప్రతి మంచి క్షణం, ప్రతి మంచి యాదృచ్చికం, ప్రతి ఆశీర్వాదం, ప్రతిరోజూ షూటింగ్, ప్రార్థనలు నా జీవితాన్ని ఇంత అందంగా మార్చాయి. వీటిన్నింటికి నేను కృతజ్ఞుతుడిని. ఇప్పుడు, ఇదంతా నా జీవితంలోని ప్రేమకు(నయనతార) అంకితం. మరి కొద్ది గంటల్లో వధువుగా నిన్ను చూసేందుకు పరితపిస్తున్న తంగమై’ అంటూ రాసుకొచ్చాడు విఘ్నేశ్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.
అయితే, కోలీవుడ్ స్టార్స్ వివాహాం కావడంతో ఈ వేడుకకు చిత్ర పరిశ్రమకు సంబంధించి స్టార్స్, పొలిటిషన్స్ కూడా హాజరుకానున్నారు. ఇటీవల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు, స్టార్స్ కమల్‌హాసన్, రజినీ కాంత్, చిరంజీవి, అజిత్, విజయ్, సూర్య, కార్తీలతో సహా పలువురు సినీ ప్రముఖులు కూడా పెళ్ళికి హాజరుకానున్నట్టు తెలుస్తోంది.
దీంతో వివాహా వేదికైన రిసార్ట్ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారని రిలేటీవ్స్ నుంచి అందిన సమాచారం. అలాగే అతిథులకు వివాహానికి ముందు ప్రత్యేక కోడ్‌ను అందజేస్తారని, కోడ్‌ను చూపిన తర్వాత వివాహ వేదికలోకి ప్రవేశించాలని తెలుస్తోంది. అదేవిధంగా పెళ్లికి సంబంధించిన డ్రెస్ కోడ్ కూడా నిర్దేశించారంట.
వివాహా వేదిక దగ్గర ఎలాంటి ఘర్షణ వాతావరణం గానీ, అతిథులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారని సమాచారం. అలాగే ఇప్పటికే వీరి వివాహా వేడకను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం చేయనున్నారనే టాక్ కూడా నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దర్శకుడు విఘ్నేష్ శివన్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పారు.
ఇవాళ (జూన్ 9)న మధ్యాహ్నం పెళ్లికి సంబంధించిన ఫొటోలను అభిమానుల కోసం సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకుంటామని తెలిపారు. జూన్ 11న నయనతార ఫ్యాన్స్ ను ప్రత్యేకంగా కలుస్తామని విఘ్నేశ్ వివన్ హామీనిచ్చారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ స్టార్ జంట ఒక్కటవుతుండటంతో సౌత్ ప్రేక్షకుల నుంచి బెస్ట్ విషెస్ అందుతున్నాయి.