Madhu Shalini: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్.. వరుడు ఎవరంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హీరోయిన్లందరూ పెళ్లి బాట పడుతున్నారు. ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రియుడు విగ్నేష్ తో ఏడడుగులు వేసిన విషయం విదితమే. ఇక తాజాగా మరో టాలీవుడ్ కుర్ర బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కింది.. అది కూడా ఎవరికి తెలియకుండా.. ఇంతకీ ఆ తెలుగు అందం ఎవరో కాదు మధుశాలిని. కితకితలు చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ వరుస అవకాశాలను అయితే అందుకుంది కానీ స్టార్ గా మాత్రం కొనసాగలేకపోయింది.
ఇక ఇటీవలే 9 అవర్స్ వెబ్ సిరీస్ లో తారకరత్న భార్యగా , జర్నలిస్ట్ గా నటించి మెప్పించిన ఈ భామ సీక్రెట్ గా వివాహమాడింది. తమిళ హీరో గోకుల్ ఆనంద్‌తో మధు శాలిని వివాహం గురువారం (జూన్ 16) హైదరాబాద్‌లో జరిగింది. గోకుల్ ఆనంద్ కోలీవుడ్ లో చిన్న చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లలో హీరోగా నటించాడు. వీరిద్దరూ కలిసి పంచాక్షరం అనే సినిమాలో నటించారు. ఆ సినిమా సెట్స్ లోనే వీరి పరిచయం ప్రేమ వరకు వెళ్లి పెళ్ళికి దారి తీసినట్లు తెలుస్తోంది.
Also Read
ఇక పెళ్లి తరువాత మధుశాలిని తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “మాకు ఇప్పటివరకు మీరు ఇచ్చిన ప్రేమకు ధన్యవాదాలు. ఇక నుంచి మేము ఎంతో ప్రేమతో, కృతజ్ఞతతో ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాము” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరు కాగా.. మరికొందరు సోషల్ మీడియా వేదికగా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!