చీరాల మండలం జాండ్రపేట బీవీ అండ్ బీఎన్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి నేడు సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. అనంతరం చేనేత కార్మికులతో కార్మికులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధం అయ్యింది.. జాతీయ చేనేత దినోత్సవం రోజున నేతన్నల కోసం నూతన బీమా పథకాన్ని ప్రారంభించనుంది.
కరోనా వల్ల చితికిపోయిన నేతన్నలు ఇప్పుడిప్పుడే కోలుకుంటూ తిరిగి పనుల్లో కుదురుకుంటున్నారు. మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా… వీరికి విద్యుత్ ఛార్జీలు పెంపు గుదిబండగా మారాయి. పరిస్థితి ఇలానే ఉంటే రైతుల్లానే మేము కూడా ఆత్మహత్య చేసుకోవాలంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు నేత కార్మికులు. పరిశ్రమల కేటగిరీలోకి మార్చి అదనపు బిల్లులు వస్తూలు చేస్తుండటంతో.. నేత కార్మికుల విద్యుత్ ఛార్జీలు రెండు రెట్లు పెరిగాయి. ఈడీ ఛార్జీల పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేస్తుండటంతో నష్టపోతున్నామని…
అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని కొట్నూర్ వద్ద వర్షపు నీరు ఇళ్ళ లోకి చేరి చేనేత కుటుంబాలు రోడ్డుపాలయ్యాయి. నేషనల్ హైవే కాంట్రాక్టర్ అక్కడ ఉన్న కాలువను మట్టితో కప్పేయడం తో వర్షపు నీరంతా ఇళ్లల్లోకి చేరి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. వర్షం పడిందంటే ఉపాధి కోల్పోయి పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని కోడూరు గ్రామానికి చెందిన కార్మికులు వాపోతున్నారు. తమ ఇంటి పక్కనే నేషనల్ హైవే పనులు జరుగుతుండడంతో ఉన్న ఇరిగేషన్ కాలువను మట్టితో…
చేనేత రంగంలో విశిష్ట సేవలందించిన భారత ప్రభుత్వ జాతీయ అవార్డు గ్రహీతలు కొలను పెద్ద వెంకయ్య, కొలను రవీందర్, గజం భగవాన్ మరియు మెరిట్ సర్టిఫికెట్ విజేతలు సాయిని భారత్, దుద్యాల శంకర్, తడక రమేష్ గార్లను చేనేత మంత్రి కేటీఆర్ అసెంబ్లీ లోని తన ఛాంబర్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతూ తమ వృత్తి నైపుణ్యంతో తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరుప్రఖ్యాతి తెచ్చిన అవార్డు గ్రహితులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశం…