తెలంగాణలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయని పేర్కొంది. అటు తెలంగాణలోని చాలా ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకోవడంతో తెల్లవారినా ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. దట్టమైన పొగమంచు కప్పేయడంతో వాహనదారులకు రోడ్లు కనిపించక ఇక్కట్లు పడుతున్నారు. Read Also: కరోనా కాలం.. ప్రతి నలుగురిలో ఒకరికి ఏదో ఒక సమస్య శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మరో వర్ష సూచన ఉంది అని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో బలపడిన అల్పపీడనం… రాగల 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా మారనుంది అని ప్రకటించింది. ఆ తదుపరి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. అది శనివారం ఉదయం నాటికి ఉత్తరాంధ్ర – ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో…
మధ్య అండమాన్ సముద్రం మరియు దాని ఆనుకొని ఉన్న ప్రాంతాల మీద ఉన్న అల్పపీడనం మరియు దీనికి అను బంధం గా ఉన్న ఉపరితల ఆవర్తనం ,మధ్య ట్రోపో స్పియర్ వరకు విస్తరించిఉన్నది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి రేపు అనగా డిసెంబర్ 2వ తేదీకల్లా వాయుగుండముగా బలపడుతుంది. ఇది మరింత బలపడి తదుపరి 24 గంటలలో మధ్య బంగాళా ఖా తం లో తుపాన్ గా మారుతుంది .ఇది తరువాత వాయువ్య దిశలో…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రేపు అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని… ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. మూడు రోజుల పాటు ఏపీలో కుండపోత వర్షాలు పడతాయని వాతావరణశాఖ సూచించింది. ఈ మేరకు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే…
కోమరిన్ ప్రాంతం మరియు దానిని ఆనుకొని ఉన్న శ్రీ లంక తీర ప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1 .5 కిలోమీటర్లు ఎత్తు వరకు విస్తరించియున్నది. వేరొక అల్పపీడనం దక్షిణ అండమాన్ సముద్రము లో సుమారు నవంబర్ 29 , 2021 వ తేదీకల్లా ఏర్పడవచ్చును ఇది తదుపరి 48 గంటల్లో మరింత బలపడి, పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణిం చే అవకాశం ఉంది. ఈరోజు తేలికపాటి వర్షాలు ఒకటి లేక…
ఏపీని వరదలు వదలనంటున్నాయి. ఏపీపై యుద్ధం ప్రకటించినట్లుగా వెనువెంటనే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో సారి ఏపీకి భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈనెల 28, 29 తేదీల్లో తిరుపతి, నెల్లూరు నగరాలలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. Also Read: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే.. సుమారు 13 సెం.మీ…
పశ్చిమ మధ్య బంగాళా ఖాతం దగ్గరలో ని దక్షిణ ఆంధ్ర కోస్తా ప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళా ఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళా ఖాతం దగ్గర లోని దక్షిణ ఆంధ్ర -ఉత్తర తమిళనాడు కోస్తా ప్రాంతం మీద ఉన్నది.ఇది సగటు సముద్ర మట్టము నకు 4 .5 కి.మీ.ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. ఆగ్నేయ బంగాళా ఖాతం మరియు దాని దగ్గర ఉన్నభూమధ్య రేఖ వద్ద…
తమిళనాడు తీరము మరియుశ్రీలంక తీరానికి పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం కొమరిన్ మరియు ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల మీద ఉన్నది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 km ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతున్నది. ఇది రాగల 48 గంటలలో ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతం మీదకు ప్రవేశించే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. తదుపరి 48 గంటలలో ఉత్తర వాయవ్యం గా…
ప్రస్తుతం అల్పపీడనం తమిళనాడు తీరానికి దగ్గరగా శ్రీలంక ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనంనకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 km ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతున్నది. రాగల 2 -3 రోజులలో ఈ అల్పపీడనం పశ్చిమ దిశలో నెమ్మదిగా ప్రయాణించే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు, రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో…
పశ్చిమ-మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం అనగా దక్షిణ ఒడిశా మరియు ఉత్తర ఆంధ్ర తీరంలో గల అల్పపీడనం దానితో పాటు అల్పపీడనానికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశకు వంగి ఉంది.. దీని ప్రభావంతో, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో 15 నుండి 16 అక్టోబర్ 2021 వరకు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది..…