నేడు భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పటిషన్లపై విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసిన భుజంరావు, తిరుపతన్న. నేడు హైదరాబాద్‌కు చంద్రబాబు. పోలింగ్ తర్వాత విదేశాలకు వెళ్లిన చంద్రబాబు. అమెరికా నుంచి ఇవాళ ఉదయం 8.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చంద్రబాబు. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72930 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,850 లుగా ఉంది. అలాగే..…
ఈ ఏడాది ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయని భారత వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది. ఎల్‌నినో పరిస్థితులు కొనసాగే సూచనలు ఉన్నందున ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు పెరిగిపోనున్నాయని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధికంగా వడగాలులు ఉంటాయని అంచనా వేసింది.
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఈరోజు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది.
రోహిణికార్తెలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో ఎండ తీవ్రతకు ఉక్కపోత తోడుకావడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదిలా ఉండగా.. పలు జిల్లాల్లో అక్కడక్కడ రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడనున్నట్లు తెలిపింది.
Heavy rain: హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. మధ్యాహ్నం వరకు భగభగలతో అల్లాడిపోయిన భాగ్యనగరం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి సూర్యని వేడితో అల్లాడుతున్న నగరవాసులకు చిరు జల్లులతో పలుకరించింది.
ఏపీలో ప్రజలు రానున్న 3 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే 3 రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే పలుచోట్ల సాధారణ ఉష్ణోగ్రతలకంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలంగాణలో నాలుగు రోజుల పాటు ఎండలు మండనున్నాయి. రాష్ట్రంలో ఈ నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.