Weather Alert: ఈ నెల 25వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రం & పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఉద్భవించే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో నవంబర్ 26 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 27వ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం మీద వాయు గుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు యానాం లో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు / ఈశాన్య గాలులు వీస్తాయని.. రాబోవు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది..
Read Also: Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చూశారా? ఫ్యాన్స్ ఫిదా..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని.. రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుందని.. ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ.
Read Also: Harish Rao: జగ్గారెడ్డి గెలిచి హైదరాబాద్ లో పడ్డాడు.. ఐదేళ్లలో ఒక్క ఊరు కూడా తిరగలేదు
ఇక, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ విషానికి వస్తే ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉండగా.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.. మరోవైపు.. రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందంటున్నారు అధికారులు.
Read Also: KTR Comments: కాళేశ్వరాన్ని బద్నాం చేయొద్దు.. బ్యారేజ్ లలో సమస్యలు రావడం సహజం
మరోవైపు రాయలసీమ విషయానికి వస్తే.. ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉండగా.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఇక, రేపు మరియు ఎల్లుండి అయితే, తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.