రుతుపవనాల ప్రభావం కారణంగా తుంగభద్ర డ్యాంకి వరద నీరు ఉప్పొంగుతోంది. కర్ణాటకను వరుణుడు ముందుగానే పలకరించడంతో తుంగభద్ర (Tungabhadra) నదికి ఇన్ ఫ్లో పెరిగింది. గత రెండు రోజులుగా ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద పోటెత్తుతోంది. కర్ణాటకలో ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ఆర్డీఎస్ ఆనకట్టకు 10,743 క్యూసెక్కుల వరద వస్తుండగా, అధికారులు ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 643 క్యూసెక్కులు, దిగువకు 10,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సుంకేసుల ఆనకట్టకు…
కర్నాటకలోని తుంగభద్ర జలాశయం నిండుతోంది. ఎగువున కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి ఇన్ ఫ్లో పెరిగిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 9,342 క్యూసెక్కులుగా వుంది. తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1593 అడుగులుగా వుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 100. 855 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 12.54 టీఎంసీలుగా వుంది. ఇన్ ఫ్లో ఇలాగే కొనసాగితే గతేడాది కంటే ముందుగానే డ్యామ్…
విభజన కారణంగా తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల విషయంలో సమస్యలు, వివాదాలు తలెత్తుతూనే వున్నాయి. కృష్ణా నదిపై ఏర్పాటైన వివిధ జలాశయాల విషయంలో ఈ ఇబ్బందులు మరీ ఎక్కువనే చెప్పాలి. రెండురాష్ట్రాల మధ్య కేంద్రం పెద్దన్న పాత్రను పోషిస్తూనే వుంది. వివిధ కారణాల వల్ల కేఆర్ఎంబీ సమావేశాలకు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒకటి హాజరుకావడం లేదు. ఈ నేపథ్యంలో ఈమధ్య జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కృష్ణా నదిపై…
కేసీఆర్ అసమర్థపాలనపై మండిపడ్డారు కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్. ప్రజా సంగ్రామ యాత్రలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పాల్గొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు బండి సంజయ్ పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి డీపీఆర్ ఎందుకివ్వడం లేదన్నారు. డీపీఆర్ లేకుండా నీటి కేటాయింపులు లేకుండా ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఆర్డీఎస్‌పై కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైంది ? కృష్ణా గోదావరి నదుల అనుసంధానం ఏమైంది..? తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా నీళ్లు, నిధులు,…
తెలంగాణలో ఒకప్పుడు నీటికొరత తీవ్రంగా వుండేది. తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తాగునీరు, సాగునీరు పుష్కలంగా లభిస్తోంది. సిద్దిపేట రూరల్ మండలం సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక గ్రామంలో నూతనంగా నిర్మించిన పట్టాభి రామ దేవస్థానంలో ఘనంగా జరుగుతున్న ప్రతిష్టా మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అర్చకులు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు…
ఏపీ ప్రజల పాలిట వరప్రదాయిని పోలవరం ప్రాజెక్ట్. రాజ్యసభలో డ్యాం సేఫ్టీ బిల్లు పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలను వెంటనే ఆమోదించాలని కేంద్రాన్ని కోరారు. సవరించిన అంచనాలను ఆమోదించేందుకు తీవ్ర కాలయాపన జరుగుతోందన్నారు. దీనివల్ల రైతులకు నష్టం జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని 31 డ్యాంల పునరావాసం కోసం ఖర్చయ్యే 776 కోట్ల రూపాయలు…
ఒక్క చెరువు వేలాదిమందిని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తిరుపతి రాయలచెరువు తాజా దుస్థితికి వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయలోపమే కారణమంటున్నారు బాధిత గ్రామస్థులు. 10 రోజులు క్రితమే తూములు మూసివేతకు గురైన విషయాన్ని రెవెన్యూ అధికారులు దృష్టికి తీసుకువెళ్ళారు ముంపు గ్రామాల ప్రజలు. రాయలచెరువు వరద ప్రవాహానికి తగ్గట్టుగా నీరు బయటకి వెళ్ళేలా అప్పట్లోనే నాలుగు తూములు ఏర్పాటు చేశారు రాయలవారు. నీటి నిల్వలు ఎక్కువగా వుండాలంటూ ఒక్కటిన్నర తూముని మూసివేశారు దిగువ గ్రామస్థులు.…
జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు కెఎస్.జవహర్ రెడ్డి. ప్రస్తుతం టీటీడీ ఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డా.జవహర్ రెడ్డిని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అమరావతిలో ఈరోజు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు జవహర్ రెడ్డి. ప్రస్తుతం డిప్యుటేషన్‌పై దేవదాయ శాఖలో ఉన్న ఆయన్ను వెనక్కు తీసుకుని జలవనరుల శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది. అయితే ఈవో స్థానంలో మరొకరిని నియమించేవరకూ…