KRMB Decision: కృష్ణా నదిపై జలాశయాల నిర్వహణకు కమిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విభజన కారణంగా తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల విషయంలో సమస్యలు, వివాదాలు తలెత్తుతూనే వున్నాయి. కృష్ణా నదిపై ఏర్పాటైన వివిధ జలాశయాల విషయంలో ఈ ఇబ్బందులు మరీ ఎక్కువనే చెప్పాలి. రెండురాష్ట్రాల మధ్య కేంద్రం పెద్దన్న పాత్రను పోషిస్తూనే వుంది. వివిధ కారణాల వల్ల కేఆర్ఎంబీ సమావేశాలకు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒకటి హాజరుకావడం లేదు. ఈ నేపథ్యంలో ఈమధ్య జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
అందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కృష్ణా నదిపై ఏర్పాటైన జలాశయాల నిర్వహణకు ఓ కమిటీ ఏర్పాటైంది. హైదరాబాద్ జలసౌధలో ఇటీవల జరిగిన భేటీలో కేఆర్ఎంబీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ కేఆర్ఎంబీ కీలక ప్రకటన విడుదల చేసింది. కేఆర్ఎంబీ సభ్యుడు రవికుమార్ పిళ్లై ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో మిగిలిన సభ్యులుగా కేఆర్ఎంబీ సభ్యుడు మౌతాంగ్, ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలు, రెండు రాష్ట్రాల జెన్‌కోలకు చెందిన వెంకటరాజం, సృజయ్ కుమార్‌లు నియమితులయ్యారు.
Also Read
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
కృష్ణానదికి సంబంధించి మూడు అంశాల ఆధారంగా ఈ కమిటీ ఏర్పాటైంది. శ్రీశైలం, సాగర్‌లో విద్యుదుత్పత్తి కోసం 15 రోజుల్లోగా విధి విధానాలు ఖరారు చేయాలని, నెలలోగా శ్రీశైలం, సాగర్ జలాశయాల రూల్ కర్వ్ ముసాయిదా పరిశీలన జరగాలని కమిటీ సూచించింది. నదిలో 75 శాతం నీటి లభ్యతకు పైబడి వరద జలాల వినియోగానికి విధి విధానాలు రూపొందించనుంది. రెండు రాష్ట్రాలు డెడ్ స్టోరేజీకి సంబంధించి విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించే విషయంలో కమిటీ విధి విధానాలు రూపొందించి కేఆర్ఎంబీకి అందచేయనుంది. మొత్తం మీద కమిటీ ద్వారా అపరిష్కృత సమస్యలు పరిష్కారం అవుతాయని రెండురాష్ట్రాల ప్రతినిధులు భావిస్తున్నారు.
Hyderabad : చేతివాటం పోలీసుపై సస్పెన్షన్ వేటు
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు