Nagarjuna Sagar Project : నాగార్జున సాగర్ కు భారీగా వరద పోటెత్తుతోంది. మొంథా తుఫాన్ ఎఫెక్ట్ బలంగా పడింది. తెలంగాణలోని చాలా జిల్లాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. అందులోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. పై నుంచి మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భాదరీగా వరద నీరు, వర్షపునీరు రావడంతో సాగర్ నిండుకుండలా మారింది. దీంతో అధికారులో 20 గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. 16 గేట్లు 10 అడుగులు,…
ఇళ్లకు, సాగునీటి మైదానాలకు ఎలాంటి వరద హానీ కలగకుండా జాగ్రత్తగా చర్యలు చేపట్టడానికి జలమండలి అధికారులు జంట జలాశయాల నుంచి భారీ మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు.
Nagarjuna Sagar : తెలంగాణలో కురుస్తున్న వర్షాలు, ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహాల కారణంగా నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టులు రికార్డు స్థాయిలో నీటిని అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం ఇన్‌ఫ్లో 3 లక్షల 70 వేల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 3 లక్షల 18 వేల క్యూసెక్కులుగా ఉంది. వరద ఉధృతి కారణంగా 12 గేట్లు 10 అడుగుల…
Prakasam Barrage Flood Alert: ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద నీరు ఉద్ధృతి కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నదీపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరదకు అనుగుణంగా అధికారులు నీటిని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. సీతారామ ప్రాజెక్ట్ ఎత్తిపోతల పనులను ఆయన పరిశీలించారు. ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 2ను మంత్రి తుమ్మల పరిశీలించారు. అనంతరం.. పంప్ హౌస్ 2 నుంచి గోదావరి జలాలను దిగువకు విడుదల చేశారు.
CM Revanth Reddy : రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటలకు ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎండలు పెరిగిన కొద్దీ తలెత్తే గడ్డు పరిస్థితులను ముందస్తు అంచనా వేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాబోయే మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ ఉన్నత అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను పరిశీలించాలని, వాటికి అనుగుణంగా పరిష్కార మార్గాలు…
నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద నీరు చేరింది. దీంతో సాగర్‌కు జలకళ సంతరించుకుంది. సాగర్ కు భారీగా వరద చేరడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈనేపథ్యంలో 8 క్రస్ట్ గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
కృష్ణా నదీయాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ వర్చువల్‌గా సమావేశమైంది. ఈ సమావేశంలో తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి వర్చువల్‌గా పాలర్గొన్నారు. ఈ భేటీలో రెండు తెలుగు రాష్ర్టాల తాగు, సాగు అవసరాలకు సంబంధించిన నీటి విడుదల గురించి చర్చించారు. నీటి కేటాయింపులపై సరైన నిర్ణయం తీసుకోవాలని మురళీధర్ బోర్డునుకోరారు. గెజిట్ అమలు పై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను ఆయన వివరించారు. కాగా ఇప్పటికే నీటి కేటాయింపులపై పలుమార్లు…