Nagarjuna Sagar: సాగర్ కు భారీగా వరద.. 8 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల..
- నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద నీరు..
- సాగర్ కు భారీగా వరద చేరడంతో అధికారులు అలర్ట్ ..
- 8 క్రస్ట్ గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna Sagar: నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద నీరు చేరింది. దీంతో సాగర్‌కు జలకళ సంతరించుకుంది. సాగర్ కు భారీగా వరద చేరడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈనేపథ్యంలో 8 క్రస్ట్ గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో తొలిసారిగా ఆగస్టు 5న క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల ప్రారంభించగా సాగర్‌కు వరద పోటెత్తడంతో సెప్టెంబర్ 19 వరకు కొనసాగింది. రెండు విడుతల్లో 435 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కావడంతో ఎన్ఎస్పీ అధికారులు బుధవారం ఉదయం 2 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. 16,200తో ప్రారంభించి క్రమంగా 8 గేట్లను ఎత్తి 64,800 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. సాగర్ జలాశయానికి వచ్చే ఇన్ ఫ్లో ఆధారంగా క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల చేపడతామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎడమ కాల్వ ద్వారా 6,022 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 6,253 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 28,907 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 400 క్యూసెక్కులు, ఎస్ఎల్బిసి ద్వారా 2,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు, జలవిద్యుత్ స్టేషన్లు, కాలువల ద్వారా 1,08,782 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతున్నది. ఇన్ ఫ్లో 93,707 క్యూసెక్కులుగా నమోదవుతోంది.
KTR Meeting: కేటీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్వీ సమావేశం.. అనంతరం గ్రూప్ వన్ అభ్యర్థులతో మీట్..
Also Read
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..