వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షి రంగన్న భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశాం అన్నారు ఎస్పీ అశోక్ కుమార్.. వివేకా హత్య కేసులో ఒక్కొక్కరుగా సాక్షులు మృత్యువాత పడుతున్నారు... వివేకా హత్య కేసులో వరుసగా నలుగురు సాక్షులు చనిపోయారు... అందుకోసం రంగన్న మృతిని అనుమానస్పద కేసుగా నమోదు చేశాం... రంగన్న మృతిపై పూర్తి దర్యాప్తు చేపడుతున్నాం...
మృతుడు రంగన్న భార్య సుశీలమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు.. నా భర్త రంగన్న అనారోగ్య సమస్యతో బాధపడేవారన్నారు.. గత ప్రభుత్వంలో మమ్మల్ని బాగా చూసుకున్నారు.. గత ప్రభుత్వంలో 3000 రూపాయలు పెన్షన్ కూడా ఇచ్చేవారని తెలిపారు.. అయితే, గత మూడు నెలల నుంచి నా భర్త చాలా మానసికంగా దెబ్బతిన్నాడు.. నా భర్త ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవారని వెల్లడింఆచరు.. నీవు వచ్చేలోపు నేను బ్రతుకుతానో లేదో అని నాతో అన్నాడని గుర్తుచేసుకున్నారు.
వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వ్యక్తి ఈ రోజు మృతిచెందారు.. వైఎస్ వివేకా కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగన్న ఈ రోజు మధ్యాహ్నం ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు.. రంగన్న వయస్సు 85 సంవత్సరాలు.. వయసు రీత్యా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న రంగన్న తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. ఆస్పత్రికి తరలించారు పోలీసులు.. అయితే, కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రంగన్న మృతిచెందారు