సినిమా హాలులో పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ తాగడం అందరికీ ఇష్టం. కానీ లోపల వాటి ధరలు మాత్రం మామూలుగా ఉండవు. బయటి ఫుడ్‌ని కూడా థియోటర్‌లోకి తీసుకెళ్ల నివ్వరు. దీని కారణంగా చాలా సార్లు జనాలు రహస్యంగా బయటి ఫుడ్ తీసుకువస్తారు. కానీ సౌదీ అరేబియాలో దీనికి విరుద్ధంగా జరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో సినిమా థియేటర్‌లోకి పెద్ద డ్రమ్ములు, బకెట్లతో వస్తున్నారు.