వరంగల్ జిల్లా బాలాజీ నగర్లో దారుణం జరిగింది. వేరే వ్యక్తితో అక్రమసంబంధం పెట్టుకుందనే అనుమానంతో రితీశ్ సింగ్ తన భార్య రేష్మాను హత్య చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బాలానగర్‌కు చెందిన రేష్మాను యూపీకి చెందిన రితీశ్ సింగ్ ప్రేమవివాహం చేసుకున్నాడు. కాగా కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానం పెంచుకున్నాడు రితీష్ సింగ్. భర్త రితేశ్ రేష్మాను హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న…
Ganja Smuggling: ములుగు రోడ్డులోని నార్కోటెక్ పోలీస్ స్టేషన్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) సైదులు ఆధ్వర్యంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి రవాణా కేసు సంబంధిత వివరాలను వెల్లడించారు. ఈ కేసులో ముందుగా వరంగల్ నర్సంపేట రోడ్డులో విశ్వసనీయ సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. అందులో ఒకరు మైనర్‌గా గుర్తించారు అధికారులు. Prasanna Kumar…
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్స్టాగ్రామ్ యాప్ ను చిన్నా పెద్ద అనే తేడా లేకుండా యూజ్ చేస్తున్నారు. రకరకాల వీడియోలతో హల్ చల్ చేస్తున్నారు. అయితే ఇన్స్టాలో సరదాగా చేసిన రీల్స్ ఒక్కోసారి గొడవలకు దారితీస్తున్నాయి. తాజాగా వరంగల్ లో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలిక, బాలుడు ముద్దు పెట్టుకుంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇంకేముంది ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇదే…
Kakatiya University: వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ భూముల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించొద్దని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగాయి. రిజిస్టర్ ఛాంబర్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి ఎపిసోడ్‌తో లోకల్ కాంగ్రెస్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కొండా సురేఖ, మురళి దంపతులకు వ్యతిరేకంగా జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏకమై ప్రత్యేక సమావేశం పెట్టి కౌంటర్ ఇచ్చిన మర్నాడే... కొండా కుమార్తె సుస్మితా పటేల్ వ్యక్తిగత ఇన్‌స్టాలో పరకాల ఎమ్మెల్యే ఆస్పరెంట్ అంటూ పెట్టిన పోస్ట్ కాకరేపుతోంది. అసలు కొండా మురళి దంపతులకు, జిల్లా కాంగ్రెస్ నేతలకు మధ్య గ్యాప్‌నకు కారణమే…
Dialogue War: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానన్న ప్రదీప్ రావు వ్యాఖ్యలపై కొండా మురళి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓరుగల్లు కాంగ్రెస్‌లో అంతర్గత పోరు... ఇప్పుడు వీధికెక్కింది. అది ఏ రేంజ్‌లో అంటే....చివరికి రాష్ట్ర నాయకత్వాన్ని కూడా సవాల్ చేసేంతలా. దీని గురించే ఇప్పుడు కాంగ్రెస్ సర్కిల్స్‌లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చిన కొత్తలో... క్రమశిక్షణ ముఖ్యం, ఉల్లంఘన ఎక్కడ జరిగినా ఉపేక్షించేది లేదంటూ... చాలా గొప్పగా చెప్పేశారు.
Konda Murali: వరంగల్ నగరంలోని వైశ్య భవన్ లో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, సంఘం నాయకులు తమ డబ్బులను గోల్మాల్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగాలంటూ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. సభ్యుల ఆహ్వానంతో కార్యక్రమానికి హాజరైన కొండా మురళి సమస్యలను పరిష్కరిస్తానని, అలాగే అనేక విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. Read Also:Gang Rape Case: “అంతా ప్లాన్ ప్రకారమే”.. కోల్‌కతా గ్యాంగ్ రేప్ కేసులో సంచలన…
నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం.. హాజరుకానున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కన్వీనర్లు.. విజయవాడ: నేడు దుర్గమ్మకు బంగారు బోనం సమర్పణ. హైదరాబాద్ ఉమ్మడి ఆలయాల కమిటీ ఆధ్వర్యంలో బోనం. జంటనగరాల్లో ఆషాఢ శోభ. ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఆదివారం నుంచే బోనాల ఉత్సవాలు ఆరంభం. నగరంలో ఘనంగా రాష్ట్ర పండుగ బోనాల పండుగ ఉత్సవాలు.. ఇవాళ్టి నుంచి నాలుగు ఆదివారాలు జంటనగరాల్లో బోనాల సందడి.…
Telangana Congress: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మళ్లీ ముదిరాయి. మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళిపై స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొండా దంపతులు చేసిన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసిన నేతలు, వారు నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలంటూ పీసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నట్టరాజన్కు ఫిర్యాదు చేయాలని జిల్లాలో పలువురు నేతలు సన్నద్ధమవుతున్నట్లు…