తెలంగాణ రాష్ట్రంపైన, సీఎం కేసీఆర్ పైన ప్రధాన మంత్రి మోడీ చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. బీజేపీ పార్టీలో అనేక మంది కుటుంబ సభ్యులు ఎంపీలుగా ఉన్నారు.. అవినీతి ప్రభుత్వం బీఆర్ఎస్ అంటున్నారు.. ఎక్కడ అవినీతి ఉందొ తెల్వదా?.. అని వినోద్ కుమార్ అడిగారు.
వ్యవసాయం ఆగిపోతే ప్రపంచం అంతరిస్తుందని…వ్యవసాయం బాగుండాలి… అన్నదాతను గౌరవించాలని… ప్రపంచ వ్యవసాయానికి నీటి ప్రాముఖ్యత తెలిపిన నేల ఓరుగల్లు అని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. వరంగల్ కోడెం ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల వానాకాలం పంటల అవగాహన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. 11 వ శతాబ్దంలోనే గొలుసుకట్టు చెరువులు, కుంటలు, ప్రముఖ ఆలయాలను కాకతీయ రాజులు నిర్మించారని…
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వడగళ్ల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో అన్నదాతలు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయాన్ని సోమవారం నాటి కేబినెట్ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్వయంగా వరంగల్ జిల్లాలో పర్యటించి రైతుల కష్టాలను తెలుసుకుందామని భావించారు. అయితే అనివార్య కారణాల వల్ల సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన…
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వరంగల్ జిల్లాలో రెండు రోజులు పర్యటించారు. మొదటి రోజు రామప్ప ఆలయాన్ని దర్శించుకున్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, రెండవ రోజు వరంగల్ నగరంలో చరిత్రాత్మక వెయ్యి స్తంభాల గుడిని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని కొత్తగా నిర్మించిన 10 కోర్టుల భావన సముదాయాన్ని ప్రారభించారు. శిథిలావస్థలో ఉన్న కోర్టులను పునరుద్దరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప గుడి…
రెండు రోజుల పర్యటన నిమిత్తం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేడు వరంగల్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని ఆయన తన సతీమణితో కలిసి సందర్శించనున్నారు. ఆలయంలోని రుద్రేశ్వర స్వామిని సీజేఐ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆలయ సందర్శన అనంతరం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ హనుమకొండకు వెళ్లి రాత్రి నిట్ కళాశాలలో బస చేస్తారు. అనంతరం ఆదివారం ఉదయం…