Tiger in Warangal: వరంగల్ జిల్లాలో పులి సంచరిస్తోందన్న వార్త ప్రజల్లో భయాందోళనలకు గురిచేస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి పాదముద్రలను గుర్తించిన అధికారులు వ్యవసాయ పనులకు వెళ్లవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి వరంగల్ లోకి ప్రవేశించిన పెద్దపులి నల్లబెల్లి, ఖానాపురం, నర్సంపేట ఏజెన్సీ గ్రామాల్లో సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాకాల అభయ అరణ్యంలోకి వెళ్లినట్లు అటవీశాఖ అధికారుల నిర్ధారించారు. మూడు రోజుల క్రితం నల్లబెల్లి మండలం రుద్రగూడెం సమీపంలోని అడవిలో పులి సంచరించింది. స్థానికుల సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలను పరిశీలించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read also: Rangareddy Crime: రంగారెడ్డిలో దారుణం.. రూ.500 కోసం దారుణ హత్య..
అనంతరం ఖానాపురం మండలంలోనూ పులి సంచరిస్తోందని సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచించారు. నర్సంపేట మండల పరిధిలోకి ఆదివారం పెద్దపులి వచ్చిందని తెలియడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా పశువులు, గొర్రెలు, మేకలను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లే గొర్రెల కాపరులు కొద్దిరోజుల పాటు మైదాన ప్రాంతాల్లో మేపాలని నర్సంపేట ఇన్ స్పెక్టర్ రమణమూర్తి సూచించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా వెళ్లి త్వరగా పనులు ముగించుకుని సాయంత్రంలోపు ఇళ్లకు చేరుకోవాలని తెలిపారు.
Read also: Astrology: డిసెంబర్ 30, సోమవారం దినఫలాలు
నల్లబెల్లి మండలంలో గత మూడు రోజులుగా సంచరిస్తున్న పెద్దపులి.. రుద్రగూడెం, కొండాయిపల్లి శివారులోని పలుగు ఈనే (కొండవాలు ప్రాంతం) నుంచి అటవీ బాట పట్టింది. పులి పాదముద్రల ఆధారంగా మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు అటవీ అధికారులు నిర్ధారించారు. రుద్రగూడెం, కొండాయిపల్లి గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు నర్సంపేట ఎఫ్ ఆర్ ఓ రవికిరణ్ ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది డ్రోన్ కెమెరా సాయంతో పలుగు ఈనె ప్రాంతాన్ని చిత్రీకరించి పరిశీలించారు. ఇక్కడే పులి చనిపోయిందని ఎఫ్‌ఆర్‌ఓ తెలిపారు. ఇంతలో పెద్దపులి అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు తేలడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.