Warangal Anganwadi Child Assault Case: వరంగల్ జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రానికి చెందిన చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటన పట్ల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అమానుష ఘటనలు సమాజాన్ని కలచివేస్తాయని, దోషులను కఠినంగా శిక్షించాలన్నది ప్రభుత్వ సంకల్పమని ఆమె స్పష్టం చేశారు. మంత్రి సీతక్క ఈ ఘటనపై వెంటనే సంబంధిత మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల నుంచి వివరాలు తెప్పించుకున్నారు. చిన్నారి ఇంటికి…
Warangal: వరంగల్‌లో మద్యం మత్తులో జరిగిన ఘర్షణ ఓ యువకుడి ప్రాణం తీసింది. ఖిలా వరంగల్ తూర్పు కోటలో స్నేహితుల మధ్య జరిగిన వాగ్వాదం నిండు ప్రాణాన్ని బలిగొంది. మద్యం సేవిస్తుండగా మాట మాట పెరగడంతో స్నేహితులు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ ఘర్షణలో తూర్పు కోటకు చెందిన సంగరబోయిన సాయి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా, మార్గమధ్యంలోనే మృతి చెందాడు.
వరంగల్ నగరంలో మహా శివరాత్రి పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ములుగు రోడ్డులోని పైడిపల్లి వద్ద ఉన్న వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చరల్ బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న రేష్మిత (20) ఆత్మహత్య చేసుకుంది. రేష్మిత ఈరోజు ఉదయం నుంచి రూములో నుండి బయటకు రాకపోవడంతో కాలేజి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చింది. రేష్మిత ఉంటున్న గది వెంటిలేటర్ నుండి పరిశీలించిన పోలీసులు.. ఆమె ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. నల్లగొండ జిల్లాలో ఉంటున్న రేష్మిత కుటుంబ…
వరంగల్ లో అక్రమ అబార్షన్ చేస్తున్న ఆసుపత్రులపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దృష్టి పెట్టారు. గత 10 రోజులుగా పలు ల్యాబ్ లు లింగ నిధారణ చేస్తునట్లు గుర్తించారు.
ఈ కాలంలో యువత చిన్న చిన్న విషయాలకే పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏందో వారు చేసేదే కరెక్ట్ అంటూ చిన్న పాటి విషయాలు వారికి పెద్దగా కనపడుతున్నాయి. దీంతో వారు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామంలో ఆటో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. 16 మందికి తీవ్ర గాయాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.