హనుమకొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ సృష్టించింది. బుధవారం రాత్రి హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనానికి పాల్పడింది. ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. సీ.సీ కెమెరాల్లో లభించిన వీడియో ఆధారంగా వరంగల్‌లోకి చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించినట్లు గుర్తించారు.
Human Trafficking : వరంగల్‌లో ఓ మహిళ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కిలేడీ గ్యాంగ్ అమాయక బాలికలను టార్గెట్ చేస్తూ పాశవిక దుశ్చర్యలకు పాల్పడుతోంది. మత్తుమందులకు బానిసై, ఈజీ మనీ కోసం బలహీన స్థితిలో ఉన్న బాలికలను లొంగదీసే ఈ ముఠా ఘోరాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా దామెర మండలానికి చెందిన ఓ మహిళ వరంగల్ మిల్స్ కాలనీలో నివాసం ఉంటోంది. డ్రగ్స్‌కు బానిసైన ఆమె తనతో పాటు మరికొంత మందితో కలిసి గ్యాంగ్ ఏర్పరచుకుంది.…
Warangal: వరంగల్ జిల్లాలోని కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటలో 18 ఏళ్ల బీహార్ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హతుడు దిల్కుష్ కుమార్ బీహార్ రాష్ట్రంలోని కగారియ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికుల సమాచారం మేరకు దిల్కుష్ కుమార్ ఎస్‌ఆర్‌ఆర్ తోట ప్రాంతంలో శవమై కనిపించగా, అక్కడే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు.…
Warangal Crime: వివాహితపై ముగ్గురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమారం చెరువు శివారులో జరిగిన విషయం తెలిసిందే. హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెరప తోట వేరబోతున్న కూలీలా ఆటోను కారు ఢీ కొట్టడంతో ఆటోలోని కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. పత్తిపాక నుండి పోచంపల్లి గ్రామానికి మిర్చి ఎరడానికి కూలీలు ఆటోలో బయలుదేరారు. పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారి చలివాగు వద్ద రాగేనే తెల్లవారు జామున ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది.
హన్మకొండ ఠాణా పరిధిలోని నయీంనగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఖాదిర్ అహ్మద్ (53), అతని పెద్ద కుమారుడు సయ్యద్ షబ్బీర్ అహ్మద్ (47) ఫారాహీనా పేరుతో ఆసుపత్రిని ప్రారంభించారు.
మద్యం మత్తులో యువకులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. స్థానిక సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి యువకులను చెదరగొట్టారు. ఈఘటన వరంగల్ లోని పోచమ్మ మైదాన్ లో చోటుచేసుకోవడంతో కలకలం రేపింది.
ఖాకీ దుస్తులు ధరించి సమాజానికి సేవ చేయాలనే యువకుడి కల నెరవేరలేదు. ఆశయ సాధనలో ఓడిపోయానని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో మూడు మార్కులు తక్కువ వచ్చినందుకు వరంగల్ జిల్లాకు చెందిన జక్కుల రాజ్ కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బైక్ రైడర్స్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. ఫ్లెక్సీలు, బోర్డింగ్ లు పెట్టి మరీ ప్రచారం చేసినా పట్టించుకోవడం లేదు. కంటి ముందు ప్రమాదాలు జరుగుతున్న పక్కనపెట్టి తమ ఆనందంకోసం బైక్ పై స్టంట్ లు చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.