Warangal Crime: ప్రేమించిన అమ్మాయి కుటుంబంపై విశిక్షణ రహితంగా తల్వార్ దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లా చంద్రరావు పేట మండలం 16చింతల తండాలో చోటుచేసుకుంది. గిర్నిబాయి కి చెందిన నాగరాజు 16 చింతల తండా దీపిక ప్రేమించుకున్నారు. వీరు మూడు నెలలు సహజీవనం కూడా చేశారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కాంప్రమైజ్ అయి ఎవరింటికి వారు వెళ్లిపోయారు. అయితే.. వీరిద్దరిని అమ్మాయి కుటుంబ సభ్యులే విడదీశారనే అమ్మాయి కుటుంబంపై నాగరాజు కక్ష పెంచుకున్నాడు. అమ్మాయి కుంటుంబంపై దాడి చేయాలని ప్లాన్ వేశాడు. చివరకు ఆ సమయం రానే వచ్చింది. నిన్న అర్ధరాత్రి 1:35 నిమిషాల సమయంలో మంచంలో బయట నిద్రిస్తున్న కుటుంబం పై తల్వార్ తో విచక్షణ రహితంగా దాడి చేశాడు. కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉండగా నిందితుడు దాడి చేశాడు. అయితే దీపిక కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేశారు.
Read also: PM Modi : ప్రధాని మోడీ ప్రతిపాదనకు పుతిన్ ఓకే.. భారత్లోనే సుఖోయ్ విమానాల భాగాల తయారీ
దీంతో స్థానికులు పరుగున బయటకు వచ్చి చూడగా ప్రియురాలు దీపికతో సహా నాగరాజు అందరికిపై తర్వాత్ తో దాడి చేస్తున్నట్లు గమనించారు. స్థానికులను చూసిన నాగరాజు అక్కడి నుంచి పరార్ అయ్యాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వెంటనే 108కు కాల్ చేసి గాయపడిన వారిని చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ దాడిలో అమ్మాయి తల్లి బానోతు సుగుణ(40) అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి బానోతు శ్రీనివాస్ (45) వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందాడు. ఇక ప్రియురాలు దీపిక (21)కు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి, తమ్ముడి మదన్(18) కి తీవ్ర గాయాలు కాగా వీరిద్దరూ నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడు నాగరాజు పరారిలో ఉన్నడని తెలిపారు.
Off The Record: మాజీ ఎమ్మెల్యే వైఖరిపై కాకినాడలో చర్చ..