Warangal Crime: పొట్టపూటి కోసం తెల్లవారు జామున లేచి రోజు కూలీ తీసుకుని కుటుంబాన్ని పోషించుకునేందుకు బయలు దేరిన కూలీల ఆటోను కారు రూపంలో దురదృష్టం వెంటాడింది. ఈరోజు కష్టపడితే వారి చేతికి కాసిన్న డబ్బులు చేతికి వస్తాయని దాంతో కుంటుంబానికి పోషించుకోవచ్చని భావించారు. కానీ.. విధి విక్రీకరించింది తెల్లవారు జామున అందరూ ఆటోలో మిర్చ ఏరడానికి కూలీలందరూ వరంగల్ నుంచి బయలు దేరారు. అందరూ ఆటోలో ఆనందంగా మాట్లాడుకుంటుండగా ఆకస్మాత్తుగా భారీ శబ్దం. ఏం జరిగిందనే లోపే ఆటో బోల్తా పడి ఆర్తనాదాలు. కూలీ లందరూ చెల్లాచెదరయ్యారు. రోడ్డంతా నెత్తుటి మయం అయ్యింది. కూలీలందరూ తీవ్రంగా గాపడ్డారు. వరంగల్ జిల్లా పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారి చలివాగు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
Read also: Hyderabad: నేడు టీడీపీ ఆవిర్భావ సభ.. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెరప తోట వేరబోతున్న కూలీలా ఆటోను కారు ఢీ కొట్టడంతో ఆటోలోని కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. పత్తిపాక నుండి పోచంపల్లి గ్రామానికి మిర్చి ఎరడానికి కూలీలు ఆటోలో బయలుదేరారు. పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారి చలివాగు వద్ద రాగేనే తెల్లవారు జామున ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా ఆటో బోల్తా పడింది. ఆటోలో వెలుతున్న కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటా హుటిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడ్డ కూలీలకు చికిత్స కోసం పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నారు. ఆటో వల్ల ఈ ప్రమాదం జరిగిందా? లేక కారు అతి వేగంగా రావడం వల్లనే ఈఘటన జరిగిందా? ఆటోలో వున్న వ్యక్తి మద్యం సేవించాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
India: ఎస్‌సీవో భద్రతా సలహాదారుల సమావేశానికి భారత్ ఆతిథ్యం.. హాజరు కానున్న పాక్!