ఉక్రెయిన్ – రష్యా ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఉక్రెయిన్ లో విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్ధులకు కేంద్రం పలు సూచనలు చేసింది. తాజా పరిణామాలతో ఉక్రెయిన్ లో వైద్యవిద్యను అభ్యసిస్తున్న వందలాది మంది తెలుగు విద్యార్ధులు. తల్లితండ్రులు ఆందోళనలో వున్నారు. ఉక్రెయిన్‌లో ఉండాల్సిన అవసరం లేని భారతీయ విద్యార్ధులు స్వదేశానికి తిరిగి రావాలని కేంద్రం సలహా ఇచ్చింది. ఉక్రెయిన్ లోని భారతీయ విద్యార్ధులు భారత్ దౌత్యకార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. ఉక్రెయిన్ లోని భారత దౌత్యకార్యాలయం…
ఉక్రెయిన్-రష్యా సంక్షోభం మరింత ముదిరింది. ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదనిపిస్తోంది. ఇప్పటికే విదేశీ పౌరులు, సిబ్బంది చాలా వరకు ఆ దేశాన్ని వీడారు. అమెరికా రాయబార కార్యాలయం ఖాళీ అయింది. ఇది పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఖాయమనే అంటున్నారు. అదే జరిగితే పర్యవసనాలు ఎలా ఉంటాయన్నది ప్రశ్న. రష్యా చర్యతో యూరప్ యుద్ధ రంగంగా మారే ప్రమాదం ఉంది. ఒకవేళ రష్యా దాడి చేయకపోయినా సమీప భవిష్యత్‌లో ఈ ఉద్రిక్తతలు ఆగవు.…
ఉక్రెయిన్- రష్యా మధ్య నెలకొన్న సంక్షోభం రోజురోజుకు పెరిగిపోతున్నది. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని రష్యా చెబుతున్నా, అమెరికా మాత్రం రష్యా చర్యలను ఖండిస్తూనే ఉన్నది. తాజాగా జర్మనీకి రెండు వేల మంది సైనికులను తరలించింది. అంతేకాదు, జర్మనీలో ఉన్న వెయ్యిమంది అమెరికా సైనికులను రష్యా సమీపంలో ఉన్న రొమేనియాకు తరలించింది. మరోవైపు ఫ్రాన్స్ సైతం రొమేనియాకు సైన్యాన్ని తరలించేందుకు సిద్దమైంది. ఇప్పటికే డెన్మార్క్ ఎఫ్ 16 విమానాలను రొమేనియా ప్రాంతంలో మోహరించింది. అమెరికా, యూరప్ దేశాలు…
రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమించుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా కీలక వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్ ఆక్రమించుకోవడం తమ ఉద్దేశం కాదని, తాము ముందుగా యుద్ధానికి దిగబోమని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సెర్గెవ్ స్పష్టం చేశారు. అమెరికా విధానాల కారణంగానే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని రష్యా స్పష్టం చేసింది. సోవియట్ యూనియన్ దేశాలను నాటోలో చేర్చుకోకూడదనేది తమ సిద్ధాంతమని దానికి విరుద్ధంగా…
ఈక్వెడార్ లోని ఓ జైలులో రెండు ముఠాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో 68 మంది మృతి చెందారు. 25 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈక్వెడార్‌లోని తీరప్రాంతమైన గుయాక్విల్‌లోని జైలులో ఆ దారుణం చోటుచేసుకున్నది. గుయాక్విల్ జైలులో తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని, డ్రగ్స్‌కేసులో బుక్ అయిన వారిని ఉంచుతారు. Read: ధాన్యం కొనుగోలుపై బీజేపీ యుద్ధం…
గత కొంతకాలంగా చైనా, తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. తైవాన్ తమ భూభాగంలో భాగమే అని, తప్పని సరిగా ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటామని చైనా చెబుతూ వస్తున్నది. కొన్ని రోజులుగా తైవాన్ సరిహద్దు ప్రాంతంలో చైనా జెట్ విమానాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే చైనా ఆ దేశాన్ని ఆక్రమించుకునే అవకాశం ఉన్నట్టు అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. అయితే, తైవాన్‌పై డ్రాగన్ దాడిచేస్తే తైవాన్‌కు అండగా పోరాటం చేస్తామని అమెరికా ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ…
సరిగ్గా 41 ఏళ్ల క్రితం అంటే 1980లో ఇరాక్ -ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో దాదాపుగా 10 లక్షల మందికి పైగా మృతి చెంది ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం బహుశా ఈ యుద్ధం సమయంలోనే జరిగి ఉంటుంది. రెండు దేశాల మధ్య దాదాపుగా 8 ఏళ్లపాటు ఈ యుద్ధం జరిగింది. అసలు రెండు దేశాల మధ్య యుద్ధం జరగడానికి కారణం ఏంటి? తెలుసుకుందాం. 1979 లో ఇస్లామిక్…
2001 నుంచి ఇరవై ఏళ్లపాటు అమెరికా లక్షల కోట్ల రూపాయలను ఆఫ్ఘనిస్తాన్‌లో సైన్యం కోసం పెట్టుబడులు పెట్టింది. విలువైన, అధునాతనమైన ఆయుధాలు సమకూర్చింది. అయినప్పటికీ కేవలం 11 రోజుల్లోనే ఆఫ్ఘన్ సేనలు తాలిబన్లకు లొంగిపోయారు అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకొవచ్చు. మూడు లక్షలకు పైగా ఆఫ్ఘన్ సేనలు ఉన్నాయని, వారంతా బలంగా ఉన్నారని, అమెరికా సైన్యం వారికి అద్భుతమైన శిక్షణ ఇచ్చిందని సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. ఆయన చెప్పిన దానికి, అక్కడ…
ఎప్పుడైతే అమెరికా సేనలు తప్పుకుంటున్నట్టు ప్రకటించాయో అప్పటి నుంచి తాలిబన్లు ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. వారాల వ్యవధిలోనే తాలిబన్లు ఆ దేశం మొత్తాన్ని ఆక్రమించుకున్నారు. ఆదివారం రోజున తాలిబన్లు కాబూల్ శివారు ప్రాంతానికి చేరుకోగా, సోమవారం నాడు కాబూల్‌లోకి వచ్చారు. అధ్యక్ష భవనంలోకి ప్రవేశించిన తరువాత తాలిబన్లు కీలక ప్రకటన చేశారు. యుద్ధం ముగిసిందని, ఆఫ్ఘన్ ప్రజలకు, ముజాహిదీన్లకు మంచిరోజులు వచ్చాయని అంతర్జాతీయ మీడియాతో తెలిపారు. శాంతియుతమైన పాలన అందిస్తామని చెప్పిన తాలిబన్ నేతలు, త్వరలోనే…