ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలు వీడితే చర్చలకు సిద్ధం అని రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా ఈ ప్రకటన చేసిన వెంటనే, తాము కూడా సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే, రష్యాపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించడం, రష్యా ఆస్తులను స్థంభింపజేయడం, సైబర్ దాడులు చేయడం వంటివి చేస్తుండటంతో పుతిన్ యూటర్న్ తీసుకున్నారు. ఎవరు చెప్పినా వినొద్దని, ఉక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. రష్యా అధ్యక్షుడి నుంచి ఈ విధమైన…
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం భయాందోళనలు కలిగిస్తున్నది. ఉక్రెయిన్‌లోకి ప్రవేశించిన రష్యా దళాలు వేగంగా కీవ్‌ను ఆక్రమించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఉక్రెయిన్ సైన్యం ప్రతిఘటిస్తున్నా అది ఎంతసేపు అన్నది ఎవరూ చెప్పలేరు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో తాలిబన్లు చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. యుద్ధం విషయంలో రెండు దేశాలు సంయమనం పాటించాలని, హింసాత్మక ఘటనలకు పాల్పడటం ద్వారా ఎలాంటి ఉపయోగం ఉండబోదని తాలిబన్లు హెచ్చరించారు. సమస్యలను రెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని…
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీ రాజకీయ జీవితాన్ని ఆరంభించే ముందు ఆయన ఏం చేశారు అనే విషయాలు ఇప్పుడు హైలెట్‌గా మారాయి. సోషల్ మీడియాలో జెలెస్కీ గురించి నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. జెలెస్కీ కి సంబంధించిన చాలా విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జెలెస్కీ రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఓ కమెడియన్‌గా జీవితాన్ని ప్రారంభించారు. ఆయన నటించిన ఓ టీవీ సీరియల్ అప్పట్లో బాగా పాపులర్ అయింది. పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించిపెట్టింది. ఆ ప్రజాభిమానాన్ని జెలెస్కీ రాజకీయంగా…
రష్యా తమపై దాడులు చేస్తోందని, కాపాడాలని ఉక్రెయిన్ భారత్ ని కోరుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రాధాన్యత ఉన్న వ్యక్తి. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భారత ప్రధాని మాట్లాడాలి. శాంతి నెలకొనేందుకు ప్రయత్నం చెయ్యాలి. భారత్ సపోర్ట్ మాకు కావాలంటున్నారు ఉక్రెయిన్ రాయబారి. ఉక్రెయిన్‌కు నాటో సంఘీభావంగా నిలుస్తోంది. ఉక్రెయిన్‌పై నిర్లక్ష్యపూరిత దాడికి పాల్పడినందుకు రష్యాపై నాటో మిత్రదేశాలు తీవ్ర ఆంక్షలు విధిస్తుంది. EU మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర భాగస్వాములతో సన్నిహిత సమన్వయంతో…
రష్యా ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు దారుణంగా దిగజారిపోయాయి. బోర్డర్‌లో ఉక్రెయిన్ సైన్యం దాడులు చేస్తోందని రష్యా ఆరోపిస్తుండగా, ఇదంతా ఫేక్ వార్తలని, తాము ఎలాంటి దాడులు చేయడం లేదని ఉక్రెయిన్ సైన్యం చెబుతున్నది. గత కొంతకాలంగా రెండు దేశాల మధ్య పరిస్థితులు మారిపోవడంతో ఉక్రెయిన్‌ను కాపాడుకోవడానికి అక్కడి మహిళలు తాము సైతం అంటూ యుద్ధ శిక్షణ తీసుకుంటున్నారు. యుద్ధం అనివార్యమైతే దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని మహిళలు చెబుతున్నారు. Read: Moon:…
రష్యా- ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఉక్రెయిన్‌కు మూడు వైపులా భారీ సంఖ్యలో రష్యా సైన్యం మోహరించింది. ఉక్రెయిన్‌కు వ్యతిరేంగా కొందరు దేశం లోపల పనిచేస్తున్నారు. రష్యా అనుకూల వేర్పాటు వాదులకు, ఉక్రెయిన్ సైన్యానికి మధ్య జరుగుతున్న ఘర్ణణలే దీనికి కారణమౌతున్నాయని పుతిన్ చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఆ దేశానికి చెందిన సైన్యం కాల్పులు జరిపినట్లు రష్యా సైన్యం వెల్లడించింది. రాకెట్ లాంచర్లతో రాకెట్లను ప్రయోగించింది. ఈ రాకెట్ల దాడిలో రష్యా…
ఉక్రెయిన్ లో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఓ విమానయాన సంస్థ తన సర్వీసుల్ని నిలిపేసింది. జర్మనీకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్సా సంక్షోభంలో చిక్కుకున్న ఉక్రెయిన్‌కు తమ సర్వీసులు ఆపేశామని ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా ఏ క్షణంలోనైనా దాడికి దిగే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ దేశ రాజధాని కీవ్‌తో పోర్టు సిటీ ఒడిసా కూడా నేటి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. తమ సిబ్బంది, ప్రయాణికుల రక్షణకు తాము…
ఉక్రెయిన్ రష్యా యుద్ధం చేసే అవకాశం ఉందని, ఫిబ్రవరి 16 నుంచి యుద్ధం జరిగే అవకాశం ఉందని పలు అంతర్జాతీయ సంస్థలు పేర్కొన్నాయి. అటు అమెరికా, ఉక్రెయిన్ దేశాలు సైతం రష్యా యుద్దానికి సన్నద్దమవుతున్నట్టు పేర్కొన్నాయి. అయితే, అనూహ్యంగా రష్యా తమ బలగాలు కొన్నింటిని వెనక్కి రప్పించింది. సరిహద్దుల్లో యుద్దవిన్యాసాలను పూర్తి అయిందని, కొన్ని బలగాలనే వెనక్కి పిలిపిస్తున్నట్టు రష్యా రక్షణశాఖ మంత్రి పేర్కొన్నారు. రష్యా రక్షణశాఖ ఆదేశాలు వచ్చిన తరువాత కొన్ని బలగాలు, యుద్ద ట్యాంకర్లను…