రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్నది. రెండు దేశాల మధ్య యుద్ధమే అయినప్పటికీ దాని ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రస్థాయిలో పడింది. ఇప్పటికే కరోనా కారణంగా పెద్ద మొత్తంలో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని మరింత అతలాకుతలం చేసింది. ఈ యుద్ధం కారణంగా ఆయిల్, నిత్యవసర ధరలతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, స్మార్ట్ ఫోన్లు, ఈవీ వాహనాల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.…
ఉక్రెయిన్ లో చిక్కుకుని పోయిన భారతీయ విద్యార్ధులకు ఊరట లభిస్తోంది. మోడీ ప్రభుత్వం వివిధ దేశాలతో దౌత్యసంబంధాలు నెరపింది. దీంతో భారతీయ విద్యార్థులకు పోలాండ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎలాంటి వీసా లేకుండా భారతీయ విద్యార్థులను తమ దేశంలోకి అనుమతిస్తామని పోలాండ్ ప్రకటించింది. ఉక్రెయిన్ నుంచి వచ్చే విద్యార్థులకు తమ దేశంలో ఆశ్రయం కల్పిస్తామని తెలిపింది. ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ నుంచి తప్పించుకున్న భారతీయ విద్యార్థులను ఎలాంటి వీసా లేకుండా దేశంలోకి ప్రవేశించే అవకాశం కలిగింది. పోలాండ్…
ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. రష్యా దళాలను ఉక్రెయిన్ సేనలు అడ్డుకుంటున్నాయి. ఉక్రెయిన్ దళాలతో పాటు ప్రజలు కూడా రష్యా సేనలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే రష్యా కీలక నగరాలను స్వాధీనం చేసుకున్నది. రష్యా సైన్యానికి అండగా పుతిన్ ప్రపంచాన్ని భయపట్టే బాంబును బయటకు తీస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ బాంబుపేరు ఫాథర్ ఆఫ్ ఆల్ బాంబ్స్. దీనినే థర్మోబారిక్ బాంబ్ అని పిలుస్తారు. ఇది న్యుక్లియర్ బాంబు కాకపోయినా, విధ్వంసం మాత్రం ఆ…
ఉక్రెయిన్ రష్యా మధ్య వార్ తీవ్రస్థాయిలో జరుగుతున్నది. కీలకమైన నగరాలను రష్యా ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటూ వస్తున్నది. అయితే, కీవ్‌కు సమీపంలో రష్యా సేనలు ప్రవేశించడంతో భీకర పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లో సుమారు 6 వేల మందికి పైగా చైనీయులు ఉన్నారు. వీరంతా ఇప్పుడు ఆ దేశంలోనే చిక్కుకుపోయారు. అక్కడి నుంచి సురక్షితంగా తరలించేందుకు ఎలాంటి అవకాశాలు లేవని, కీవ్ నరగంలో ఉన్న చైనీయులు అర్ధం చేసుకోవాలని చైనా రాయబారి ఫ్యాన్ షియాన్‌రాంగ్ పేర్కొన్నారు. Read:…
విద్యార్ధులు విద్యకోసం విదేశాలకు వెళ్లాలి అనుకున్నప్పుడు అందరికి గుర్తుకు వచ్చే దేశం ఉక్రెయిన్. ఉక్రెయిన్‌లో విద్యను అభ్యసించేందుకు పెద్ద సంఖ్యలో ఇండియా నుంచి వెళ్తుంటారు. ముఖ్యంగా మెడికల్ విద్యను అభ్యసించేందుకు వెళ్తుంటారు. ఉక్రెయిన్‌లో విద్యను అభ్యసించేందుకు వెళ్లడం వెనుక కారణం లేకపోలేదు. అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాలతో పోల్చుకుంటే ఉక్రెయిన్‌లో లివింగ్ కాస్ట్ చాలా తక్కువ. సాంకేతిక, వైద్య విద్య కోర్సులను అక్కడి స్థానిక భాషలతో పాటు ఇంగ్లీష్‌లో కూడా బోధన ఉండడం మరో కారణం. దీంతో…
రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్నది. దీంతో ఉక్రెయిన్‌లో ఎటు చూసీనా భీభత్సమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏ క్షణంలో ఎటు నుంచి బాంబులు వచ్చిపడతాయో, ఎటు నుంచి తూటాలు దూసుకొస్తాయో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. రష్యా నుంచి పెద్ద సంఖ్యలో ట్యాంకర్లు విరుచుకుపడుతున్నాయి. అయితే, ఈ ట్యాంకర్లలో కొన్నింటిపై జెడ్ అనే అక్షరం రాసున్నది. ఆ అక్షరం ఏంటి? ఎందుకు జెడ్ అక్షరాన్ని దానిపై రాస్తారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.…
ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోకి రష్యా దళాలు ఇప్పటికే ప్రవేశించాయి. రెండు దేశాల సైనికుల మధ్య యుద్ధం బీకరస్థాయిలో జరుగుతున్నది. ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది. ఈ దాడులకు భయపడి సామాన్యప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. బంకర్లలో తల దాచుకుంటున్నారు. ఇలాంటి ఉక్రెయిన్ మరుభూమిగా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఎవరికి పెళ్లి అనే ఆలోచన రాదు. పెళ్లి కంటే బతికి ఉండటమే మేలు అనుకుంటారు. Read: Ukraine –…
ఉక్రెయిన్ రష్యా మధ్య ఇప్పటికే గత మూడు రోజులుగా యుద్ధం జరుగుతున్నది. ఈ యుద్ధంలో విజయం సాధించి ఉక్రెయిన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని రష్యా చూస్తున్నది. అయితే, వీలైనంత వరకు రష్యా సేనలకు నిలువరించేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. రష్యా తీసుకున్న యుద్ధ నిర్ణయం పట్ల ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించాయి. యూరోపియన్ యూనియన్, అమెరికా దేశాలు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించాయి. ఆంక్షలు విధించినప్పటికీ రష్యా వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ మొత్తాన్ని స్వాధీనం…
రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. రష్యా బలగాలు ఇప్పటికే ఉక్రెయిన్‌లో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎలాగైనా ఉక్రెయిన్ దేశాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని పుతిన్ ఆదేశాలు జారీ చేయడంతో పోరును పెద్ద ఎత్తున చేస్తున్నారు. రష్యా బలగాలకు ధీటుగా ఉక్రెయిన్కూడా పోరాటం చేస్తున్నది. ఇప్పటికే దాదాపు 3500 మంది రష్యన్ బలగాలను హతమార్చినట్టు ఉక్రెయిన్ చెబుతున్నది. అయితే, దీన్ని రష్యా దృవీకరించడం లేదు. ఇక ఇదిలా ఉంటే, ఉక్రెయిన్ కు…