అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ల వివాహానంతరం శనివారం ముంబై జియో వరల్డ్ సెంటర్‌లో శుభ్ ఆశీర్వాద కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అతిథులు ఒక్కొక్కరు వచ్చి వేదికపై ఫొటోలు దిగుతున్నారు.
రైల్వే ప్రయాణమంటే ఎలా ఉంటుందో చాలా మందికి అనుభవమే. కిక్కిరిసిన ప్రయాణికులు.. డోర్‌ల దగ్గర వ్రేలాడడం వంటి సీన్లు కనిపిస్తుంటాయి. జనరల్ బోగీల్లో కనీసం నిలబడేందుకు కూడా చోటు లేక ఇబ్బందులు పడుతుంటారు.
మాజీ కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నేత సామాన్యుడిలా రైల్వే ప్లాట్ ఫాం మీద కూర్చున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సికింద్రాబాద్ నుంచి విజయనగరం రైలులో ప్రయాణించుటకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ అరుగు మీద కూర్చున్నారు. గతంలో కేంద్ర విమానయానశాఖ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు రాజకుటుంబానికి చెందినవారు. అయితే సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన ఆయన.. ఒక సామాన్య ప్రయాణికుడిలా రైల్వే స్టేషన్‌లో కనిపించారు.…
శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో అయ్యప్ప భక్తులు పడిగాపులు కాస్తున్నారు. శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వెళ్లనున్న భక్తులు నానా తిప్పలు పడుతున్నారు. అయితే భక్తులు మధ్యాహ్నమే కొచ్చికి బయలుదేరాల్సి ఉండగా.. ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపంతో ఇంకా వెళ్లలేదు. దీంతో మధ్యాహ్నం నుంచి 64 మంది అయ్యప్ప భక్తులు ఎయిర్ పోర్ట్ లోనే పడిగాపులు గాస్తున్నారు. ఇదే విషయమై ఎయిర్ పోర్టు అధికారులను అడిగితే.. ఎలాంటి స్పందన ఇవ్వడం లేదని చెబుతున్నారు. కాగా.. తాము వెళ్లాల్సిన కనెక్టింగ్…
రోజులు,ఏళ్ళు గడిచిపోతున్నాయి కానీ.. నామినేటెడ్ పదవులపై చాలామంది టీఆర్‌ఎస్ నేతల ఆశలు తీరడంలేదు. ఈ ఏడాదిలోనైనా వారికల నెరవేరుతుందా? అధికారపార్టీ ఆలోచన ఏంటి? పదవులతో ఎంతమందిని సంతృప్తి పర్చగలదు? కొత్త ఏడాదిలో పదవులు వస్తాయనే ఆశల్లో నేతలు గంపెడాశలతో వున్నారు. 2018 డిసెంబర్‌లో టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి నామినేటెడ్ పదవులపై అనేకమంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు. అప్పటికే నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారికి పదవీకాలం ముగియడంతో వాళ్లల్లో కొందరికి మరోఛాన్స్ ఇచ్చారు సీఎం…