అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ల వివాహానంతరం శనివారం ముంబై జియో వరల్డ్ సెంటర్‌లో శుభ్ ఆశీర్వాద కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అతిథులు ఒక్కొక్కరు వచ్చి వేదికపై ఫొటోలు దిగుతున్నారు. ఈ సందర్భంగా మాజీ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, తన భార్య సాక్షి, కుమార్తె జీవాతో కలిసి ఫొటోలకు ఫోజులిస్తున్నారు. అక్కడే ఉన్న సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్.. వారు ఫొటోలు దిగేంత వరకు ప్రక్కనే నిరీక్షించారు. అలా చూస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Anant Ambani Wedding: “శుభ్ ఆశీర్వాద్” వేడుకకు హాజరైన ప్రధాని మోడీ..
శుక్రవారం అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులు హాజరై సందడి చేశారు. తారాలోకం.. డ్యాన్సుల అలరించారు.
ఇది కూడా చదవండి: Anant Ambani Wedding: అనంత్-రాధిక పెళ్లి వీడియో వచ్చేసింది.. సందడే.. సందడి