Supreme Court : ఓటరు నమోదు ఆలస్యంపై ఎన్నికల సంఘం దాఖలు చేసిన ఏడీఆర్ పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.
రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంపొందించేందుకు, ప్రజాస్వామ్యాన్ని అర్థవంతంగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కోరారు. యువకులు, పట్టణ ఓటర్లు ఎన్నికల ప్రక్రియ పట్ల ఉదాసీనత వంటి వివిధ కారణాల వల్ల వరుసగా జరిగిన ఎన్నికల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఓటింగ్ శాతం మరింత తగ్గకుండా సీఈవోలు కృషి చేయాలని ఆయన…
9.77% voting till 9 am in Rajasthan: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద జనాలు బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు 9.77 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. తొలి 2 గంటల్లో చాలా మంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత…