లోక్‌సభ ఎన్నికల అనంతరం ఎన్నికల సంఘం డేటాను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల ఓటింగ్ గణాంకాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఓటరు జాబితాలో తమ పేర్లను చేర్చుకునే సమయంలో వీరిలో చాలా ఉత్సాహం కనిపించిందని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటరు జాబితాలో 1.2 లక్షల మంది తమ పేర్లను చేర్చుకోగా, ఎన్నికల సమయంలో కేవలం 2.48 శాతం మంది మాత్రమే ఓటు వేయడానికి భారతదేశానికి వచ్చారు.