David Flucker: వందేళ్ల వృద్ధుడు.. కానీ ఇంకా పనిచేస్తున్నాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆరోగ్యం క్షీణించడం, అనేక ఇతర కారణాల వల్ల చాలా మంది వయస్సు పెరిగేకొద్దీ ఉద్యోగాల నుండి విరమించుకుంటారు. అయితే, డేవిడ్ ఫ్లకర్ అనే 100 ఏళ్ల వృద్ధుడు మాత్రం ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. ఎడిన్‌బర్గ్‌కు చెందిన ఈ వ్యక్తి ఇప్పటికీ వారానికి మూడు రోజులు స్వచ్ఛందంగా పనిచేస్తున్నాడు. జూన్ 22న ఆయన 100వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఇప్పటికీ వారానికి మూడు రోజులు స్వచ్ఛందంగా సేవ చేసే ఈ 100 ఏళ్ల వృద్ధుడి కథ చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ శతాధిక వృద్ధుడి గురించి తెలుసుకుంటే మీరు కూడా స్ఫూర్తిని పొందవచ్చు.
డేవిడ్ ఫ్లకర్ తన వైఖరితో చాలా మందిలో స్ఫూర్తిని నింపాడు. సెయింట్ కొలంబస్ హాస్పైస్ కేర్ షాప్‌లో ఆయన వాలంటీర్‌గా పనిచేస్తున్నారు. వారానికి మూడు రోజుల పాటు జిగ్సా ముక్కలను లెక్కించడం, బొమ్మలు సరిచేయడం, బట్టలకు ఆవిరిపట్టడం, కస్టమర్‌లతో మాట్లాడడం లాంటి విధులను నిర్వర్తిస్తున్నారు. ఆయన 100వ జన్మదినం సందర్భంగా ఆ షాప్ యాజమాన్యం అతని జీవితం గురించే తెలిపే విధంగా ప్రదర్శన ఏర్పాటు చేసి అతనికి అంకితం చేసింది.
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ఓషన్ టెర్మినల్ షాపింగ్ సెంటర్ ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్ వైరల్ అయింది. అందులో ఆయన గురించి వివరించారు. ఆయన న్యూహెవెన్‌లో జన్మించారని.. తన జీవిత కాలంలో డేవిడ్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో నివసించాడని వివరించారు. వందేళ్లు దాటినా పని మానేయాలనే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. ఈ జీవితం ఇతరులకు సేవ చేసేందుకేనని ఆయన చెప్పాడని వివరించారు.
ఫేస్‌బుక్‌లో ఈ ఫోస్ట్‌ను చూసిన వారు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “పుట్టినరోజు శుభాకాంక్షలు డేవిడ్. మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు, గొప్ప రోల్ మోడల్” అంటూ అభినందించారు. “హ్యాపీ బర్త్ డే వావ్ అద్భుతం” అని మరొకరు పోస్ట్ చేసారు. “ఎంత అపురూపమైన మనిషి. హ్యాపీ బర్త్ డే డేవిడ్!” మరొకరు శుభాకాంక్షలు తెలిపారు. వందేళ్ల వయసులోనూ పనిచేస్తూ ఆయన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
తాజావార్తలు
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!